Telugu Gateway
Politics

ప్రకాష్ రాజ్ పై ఒత్తిడి చేసిన ఆ తెలంగాణ మంత్రి ఎవరు?!

ప్రకాష్ రాజ్ పై ఒత్తిడి చేసిన ఆ తెలంగాణ మంత్రి ఎవరు?!
X

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కి అనుకూలంగా ప్రకటన చేయమని సినీ నటుడు ప్రకాష్ రాజ్ పై ఒత్తిడి చేసిన మంత్రి ఎవరు?. ఎలాంటి ప్రకటన చేయవద్దు.. మౌనంగా ఉండాలని కోరింది ఓ పార్టీ . కానీ చివరకు తెలంగాణ మంత్రి ఒత్తిడే పలించింది. అందులో భాగంగానే ప్రకాష్ రాజ్ ఓ ఛానల్ తో మాట్లాడుతూ టీఆర్ఎస్ కు ఓటు వేయాలని కోరారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బహిరంగంగా మద్దతు ఇచ్చిన ప్రకాష్ రాజ్..తెలంగాణకు వచ్చేసరికి మాత్రం కాంగ్రెస్ వల్ల ఉపయోగం లేదని చెప్పటం విశేషం. అంతే కాదు. ‘చంద్రబాబునాయుడిని మనం ఓ మాట అడగాలి. 15 సీట్లలో పోటీ చేసి మీరు ఇక్కడ ఏమి చేస్తారు. మీరు సీఎం కాలేరు. రేపు తెలంగాణకు ఆంధ్రాకు ప్రాబ్లం వస్తే మీరు ఎటువైపు ఉంటారు?. ఇక్కడ కాంగ్రెస్ లీడర్ ఎవరు?. కాంగ్రెస్ గెలిస్తే ఏమి చేస్తారు?. నేను టీఆర్ఎస్ కాదు. కానీ కెసీఆర్ ను లీడర్ గా తీసేయలేం. ఆయన స్టేట్స్ మెట్. ప్రాంతీయ పార్టీని గెలిపించాలి. రాష్ట్రం గురించి ఆలోచించాలి.’ అని వ్యాఖ్యానించారు. ఓ వైపు ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనాకు రావొచ్చు అంటూ...మహాకూటమిలోని కాంగ్రెస్ పార్టీ..టీడీపీకి ఇక్కడకు ఎందుకొస్తున్నాయి? అని ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. ఇదే టీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ లో వెళ్ళి పోటీచేస్తే ఊరుకుంటారా?.జాతీయ పార్టీలు గత 70 సంవత్సరాలుగా ఫెయిల్ అయ్యాయని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు.

మరి ఇదే ప్రకాష్ రాజ్ కు కర్ణాటకలో తాను మద్దతు ఇచ్చింది జాతీయ పార్టీ కాంగ్రెస్ కు అని తెలియదా?. అంతలోనే ఆయన తన వైఖరిని ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది?. ప్రకాష్ రాజ్ తన అభిప్రాయాలను స్వేచ్చగా వెల్లడించే హక్కు ఎలా ఉందో...మిగిలిన రాజకీయ పార్టీలకు కూడా పోటీ చేసే హక్కు ఉంటుందని ప్రకాష్ రాజ్ కు ఎవరైనా చెప్పాలా?. ఎవరిని గెలిపించుకోవాలో ప్రజలకు తెలుసు?. విచిత్రం ఏమిటంటే ఓ మంత్రి ఒత్తిడికి తలొగ్గి ప్రకటన ఇచ్చిన ప్రకాష్ రాజ్ నిత్యం ‘జస్ట్ ఆస్కింగ్’ అంటూ ‘స్వేచ్చ’ గురించి మాట్లాడటమే?!

Next Story
Share it