తిరుపతిలో ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో వేడుక!
ఎన్టీఆర్ బయోపిక్. సరిగ్గా ఎన్నికల నాటికి రెడీ కానుంది. ఈ చిత్రాన్ని టీడీపీ రాజకీయంగా కూడా ఉపయోగించుకునే ఆలోచనలో ఉంది. కొత్త తరానికి ఎన్టీఆర్ గురించి తెలియజేయటం ఒకెత్తు అయితే...పాత తరం వారికి మరోసారి ఎన్టీఆర్ ను గుర్తుచేయటం మరో కోణం. స్వయంగా బాలయ్య ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. తొలుత ఒక భాగమే అనుకున్నా..తర్వాత సినిమా రంగానికి సంబంధించి కథానాయకుడు ఒక భాగంగా, రాజకీయ రంగ ప్రవేశానికి సంబంధించి మహానాయకుడిగా రెండు భాగాలుగా విడుదల చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించి కీలకమైన అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా ఆడియో విడుదల డిసెంబర్ 16న తిరుపతిలో జరగనుంది. ఈ మధ్య తెలుగులోనూ బయోపిక్ లకు బాగా ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా సావిత్ర జీవిత కథతో తెరకెక్కించిన మహానటి దుమ్మురేపిన సంగతి తెలిసిందే.