సైరాలో నయన్ లుక్ చూశారా?
సైరా నరసింహరెడ్డి. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చారిత్రక చిత్రంలో హీరోయిన్ నయనతార లుక్ ను ఆదివారం నాడు విడుదల చేసింది చిత్ర యూనిట్. నయనతార పుట్టినరోజును పురస్కరించుకుని ఆమె తో లుక్ ను బహిర్గతం చేయటంతో మోషన్ పిక్చర్ ను కూడా విడుదల చేశారు. ఈ సినిమాలో నయనతార ‘సిద్ధమ్మ’గా నటించనుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా 2019 వేసవిలో విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ కురెడీ అవుతున్న ఈ మూవీలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో పాటు జగపతిబాబు, సుధీప్, విజయ్ సేతుపతి, తమన్నా ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను చిరంజీవి తనయుడు రామ్ చరణ్ సొంతంగా కొణిదెల బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు.
https://www.youtube.com/watch?v=5nkZT-7qVfA