నాని ‘జెర్సీ’ రిలీజ్ డేట్ వచ్చేసింది
BY Telugu Gateway23 Nov 2018 1:04 PM GMT

X
Telugu Gateway23 Nov 2018 1:04 PM GMT
నాని కొత్త సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ వినూత్నంగా విడుదల చేసింది. జెర్సీ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 19న విడుదల చేయనున్నట్లు హీరో నాని ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఓ బ్యాట్‌పై జెర్సీ అనే టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ (ఏప్రిల్ 19)ను ఫిక్స్ చేశారు. ‘యూ టర్న్’ భామ శ్రద్ధా శ్రీనాథ్ ఇందులో కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
పీడీవీ ప్రసాద్ సమర్పణలో నాగవంశీ నిర్మిస్తుండగా.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. నాగార్జునతో కలసి నాని నటించిన సినిమా ‘దేవదాస్’ ప్రేక్షకులను ఆకట్టుకుంది. వరస హిట్లతో దూసుకెళుతున్న ఈ హీరోకు అక్కడక్కడ బ్రేకులు పడుతుండటంతో కొత్త సినిమాల విషయంలో నాని మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. సమ్మర్ లో సందడి చేయటానికి నాని రెడీ అయిపోయాడని చిత్ర విడుదల తేదీ చెబుతోంది.
Next Story