Telugu Gateway
Cinema

అఖిల్ ‘హంగామా’

అఖిల్ ‘హంగామా’
X

అక్కినేని అఖిల్ హంగామా మొదలైంది. ఈ సారి ‘మిస్టర్ మజ్ను’ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ అక్కినేని కుర్ర హీరో ఎప్పటి నుంచో సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. చేసిన సినిమాలు అన్నీ యావరేజ్ టాక్ తోనే సరిపుచ్చుతున్నాయి. అయినా సరే పట్టువదలని విక్రమార్కుడిలా తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు ఈ మజ్ను. కొత్త సినిమాలో అఖిల్ పాటలోనే హంగామా చేయనున్నాడట. తాజాగా యూకెలో సినిమాలో కీలకమైన పాట చిత్రీకరణం పూర్తి చేసుకున్నారు.

అందులో అఖిల్‌తో పాటు 30 నుంచి 40 మంది మోడల్స్‌ పాల్గొనగా ఈ పాట మేజర్‌ షూటింగ్‌ పూర్తయింది. ఇదే సాంగ్‌లోని కొంత భాగాన్ని హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో వేసిన భారీ సెట్‌లో షూట్‌ చేశారు. ఈ సినిమా తదుపరి షెడ్యూల్‌ వారం రోజుల్లో హైదరాబాద్‌లో స్టార్ట్‌ కానుందని సమాచారం. జనవరిలో ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. ‘తొలిప్రేమ’ ఫేమ్‌ వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్‌ హీరోగా బీవీయస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రమే ‘మిస్టర్‌ మజ్ను’. ఇందులో నిధీ అగర్వాల్‌ కథానాయికగా నటిస్తున్నారు.

Next Story
Share it