Telugu Gateway
Telangana

భార్య బర్త్ డే కోసం 70 కోట్లు ఖర్చు పెట్టిన మెగా కృష్ణారెడ్డి!

భార్య బర్త్ డే కోసం 70 కోట్లు ఖర్చు పెట్టిన మెగా కృష్ణారెడ్డి!
X

కార్పొరేట్ ప్రముఖుల బర్త్ డే పార్టీల లుక్ మారింది. కొంత మంది కాంట్రాక్టర్లు తమ పుట్టిన రోజులకు స్నేహితులు..బంధువర్గాలను ప్రత్యేక విమానాల్లో విదేశాలకు తీసుకెళ్ళి మరీ పార్టీలు ఇస్తున్నారు. ఈ కల్చర్ గత కొంత కాలంగా హైదరాబాద్ లోనూ జోరందుకుంది. మెఘా ఇంజనీరింగ్. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు..దేశంలోనే ఇప్పుడు ఈ పేరు తెలియని వారు ఉండరు. ఎందుకంటే అతి తక్కువ సమయంలో ఆ కంపెనీ అలా ‘ఎదిగింది’. తెలంగాణ, ఏపీల్లో అయితే ఏ కాంట్రాక్ట్ అయినా ఈ సంస్థకే. ఆ సంస్థ కాదనుకుంటే తప్ప..వేరే వాళ్లకు దక్కని పరిస్థితి ఉందని సాక్ష్యాత్తూ ఉన్నతాధికారులే చేతులెత్తేస్తున్నారు. మెగా ఇంజనీరింగ్ ఛైర్మన్ పిచ్చిరెడ్డి కొద్ది కాలం క్రితం తన పుట్టిన రోజుకు ఏకంగా కోటి రూపాయలు ఖర్చు పెట్టి మరీ ‘సన్నిలియోన్’తో డ్యాన్స్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అంతే కాదు..సన్నిలియోన్ తో కలసి పిచ్చిరెడ్డి స్టెప్పులు కూడా వేశారు. ఇప్పుడు మెగా ఇంజనీరింగ్ మేనేజింగ్ కృష్ణారెడ్డి వంతు వచ్చింది. ఆయన తన భార్య సుధారెడ్డి పుట్టిన రోజు కోసం ఏకంగా 70 కోట్ల రూపాయలు పైనే ఖర్చు పెట్టినట్లు కార్పొరేట్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కార్పొరేట్ సర్కిల్స్ లో ఇదే హాట్ టాపిక్.

పుట్టిన రోజు సందర్భంగా మెగా కృష్ణారెడ్డి తన భార్యకు 55 కోట్ల రూపాయలు విలువ చేసే హై ఎండ్ రోల్స్ రాయిస్ కారును బహుకరించారు. ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ కారును ఆమె పుట్టిన రోజే కంపెనీ ప్రతినిధులు హైదరాబాద్ లో అందజేసి వెళ్ళారు. కేవలం ఫంక్షన్ పైనే దాదాపు 9 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దేశంలోనే ఎంతో పేరున్న ఫ్యాషన్ డిజైనర్ రీతూ దాల్మియా ఆధ్వర్యంలో పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. ఇక్కడ కార్యక్రమాల కోసం ఏకంగా సింగపూర్ నుంచి మోడల్స్ ను రప్పించారు. ఒక్క రీతూ దాల్మియానే తన విజిట్ కు 50 లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తుందని..సింగపూర్ మోడల్స్ తో కలుపుకుంటే ఈ వ్యయం అంతా 1.5 కోట్ల రూపాయల వరకూ ఉంటుందని ఆ బర్త్ లో పాల్గొన్న వ్యక్తి ఒకరు తెలిపారు.

ఇక పుట్టిన రోజుకు హాజరైన అతిధులకు అయితే అంతా విదేశీ మద్యమే తప్ప..చూద్దామన్న దేశీయ బ్రాండ్లు అక్కడ కన్పించలేదు. ప్రతి ఏడాది ఆమె తన పుట్టిన రోజును ఒక్కో దేశంలో జరుపుకోవటం అలవాటు. కానీ ఈ సారి మాత్రం భారత్ లో..అదీ హైదరాబాద్ లో చేసుకున్నారు. సుధారెడ్డి పుట్టిన రోజుకు మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీతో పాటు చాముండేశ్వరి నాధ్, డాక్టర్ గురవారెడ్డి, ఏపీఈడీబీ సీఈవో జాస్తి కృష్ణకిషోర్, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని ప్రారిశ్రామిక ప్రముఖులు కూడా సుధారెడ్డి బర్త్ డేకు హాజరైనట్లు సమాచారం.

Next Story
Share it