Telugu Gateway
Andhra Pradesh

పవన్ కాన్వాయ్ ను ఢీకొట్టిన లారీ

పవన్  కాన్వాయ్ ను ఢీకొట్టిన లారీ
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ వాహనాలను ఓ లారీ ఢీకొట్టింది. దీంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనలో పవన్ కళ్యాణ్ ప్రైవేట్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారందరినీ వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న పవన్ రాజానగరం బహిరంగ సభలో పాల్గొనేందుకు వెళ్తుండగా రంగంపేట వద్ద ప్రమాదం జరిగింది.

భద్రతా సిబ్బందికి చిన్నపాటి గాయలు కావడం, ప్రాణాపాయం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి కారణం ఏమిటనేది తెలియాల్సి ఉంది. గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గత కొంత కాలంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితోపాటు ఆయన తనయుడు నారా లోకేష్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.

Next Story
Share it