Top
Telugu Gateway

టీఆర్ఎస్ కు మరో షాక్..మాజీ ఎమ్మెల్యే గుడ్ బై

టీఆర్ఎస్ కు మరో షాక్..మాజీ ఎమ్మెల్యే గుడ్ బై
X

అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కు మరో షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య కారు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. అది కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసీఆర్ పర్యటన ఉన్న రోజే జరగటం విశేషం. పార్టీలో తనకు సరైన గుర్తింపులేదని..కనీసం సీఎం జిల్లా పర్యటన సమాచారం కూడా ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. గతంలో కెసీఆర్ కోనప్పను ఆంధ్రా అప్ప అని ఎద్దేవా చేశారని..ఇప్పుడు ఉద్యమంలో సిన్సియర్ గా పాల్గొన్న తన లాంటి వాళ్లను పక్కన పెట్టారని విమర్శించారు. త్వరలోనే తన కావేటి సమ్మయ్య కాంగ్రెస్ గూటికి చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎన్నికల సమయంలో వరసగా పడుతున్న వికెట్లు టీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళనకు గురవుతున్నాయి.

Next Story
Share it