కొడంగల్ లో భారీగా పట్టుబడ్డ నగదు

లంగాణలో హాట్ టాపిక్ గా మారిన కొడంగల్ నియోజకవర్గంలో భారీగా నగదు పట్టుపడింది. ఈ విషయాన్ని ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ కూడా స్పష్టం చేశారు. అయితే తమకు నివేదిక సీల్డ్ కవర్ లో వచ్చిందని..అది చూసిన తర్వాతే వివరాలు వెల్లడించగలమన్నారు. టీఆర్ఎస్ అభ్యర్ధి పట్నం నరేందర్ రెడ్డి ఇంట్లో బుధవారం ఉదయమే ఆదాయ పన్ను శాఖ
అధికారులు తనిఖీలు చేశారు. నరేందర్ రెడ్డితోపాటు..ఆయన సమీప బంధులు ఇళ్ళలోనూ సోదాలు జరిగాయి. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఎలాగైనా రేవంత్ రెడ్డిని ఓడించాలని అధికార పార్టీ ప్రయత్నాలు చే్స్తోంది. రేవంత్ రెడ్డి కూడా ఢీ అంటే ఢీ అనే తరహాలో దూసుకెళుతున్నారు.
ఈ తరుణంలో ఏకంగా అధికార పార్టీ అభ్యర్ధి ఇంట్లో భారీ ఎత్తున నగదు పట్టుబడటం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. నగదు పట్టుబడిన ఇళ్లు టీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి సమీప బంధువుగా భావిస్తున్నామని అన్నారు. తనకు ఎలాంటి పక్షపాతం లేదని, అధికార పార్టీకి చెందిన ఇద్దరు అభ్యర్థుల ఇళ్లల్లో సోదాలు జరిగాయని, విచారణ జరిపిన తర్వాత పూర్తి వివరాలు రేపు మీడియాకు వెల్లడిస్తామని రజత్‌కుమార్ స్పష్టం చేశారు.