Top
Telugu Gateway

కార్తీ ‘దేవ్ టీజర్’ విడుదల

కార్తీ ‘దేవ్ టీజర్’ విడుదల
X

కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన దేవ్ సినిమా విడుదలకు రంగం సిద్ధం అయింది. అందులో భాగంగా చిత్ర ప్రమోషన్ కూడా చిత్ర యూనిట్ సోమవారం నాడు దేవ్ సినిమా టీజర్ ను విడుదల చేసింది. కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్ జోడీ కట్టడం ఇది రెండవ సారి. గతంలో వీరిద్దరూ కలసి ఖాకీ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. లవ్‌.. యాక్షన్‌.. రొమాన్స్‌ సీన్స్‌తో కూడిన ఈ టీజర్‌ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది.

‘ఈ లోకంలో బతకడానికి ఎన్నో దార్లున్నాయి.. ఎవరో చెప్పారని అర్థంగాని చదువు చదివి.. ఇష్టం లేని ఉద్యోగం చేసి.. ముక్కు మొహం తెలియని నలుగురు మెచ్చుకోవాలని కష్టపడి పడి పనిచేసి.. ఈగో, ప్రెషర్.. కాంపిటేషన్లో ఇరుక్కుని.. అంటీ అంటనట్టు లవ్ చేసి.. ఏం జరుగుతుందో అర్థం కాకుండా బతకడం ఓ దారి. ఇంకోదారి ఉంది..’ అంటూ కార్తీ వాయిస్‌ ఓవర్‌తో టీజర్‌ సాగింది. చివర్లో ‘నన్ను వదిలేస్తే అమ్మాయిని తీసుకుపోతూ ఉంటా..’ కార్తీ తన డైలాగ్‌ డెలివరీతో ఆకట్టుకున్నాడు. టీజర్‌లో కార్తీ చాలా స్టైలిష్‌గా కనిపించారు. ఈ సినిమాలో ప్రకాష్‌ రాజ్‌, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

https://www.youtube.com/watch?v=CJ8ua76K39I

Next Story
Share it