Telugu Gateway
Cinema

దుమ్మురేపిన నివేదా డ్యాన్స్

దుమ్మురేపిన నివేదా డ్యాన్స్
X

నివేదా థామస్. ఆ అమ్మడిలో ఏదో తెలియని ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది. టాలీవుడ్ లోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ హీరోయిన్. కానీ ఎందుకో అవకాశాలు అంతగా వస్తున్నట్లు లేదు. నాని జెంటిల్‌మెన్‌ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మలయాళ ముద్దు గుమ్మ.. నిన్నుకోరి, జై లవకుశలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. నిత్యం సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నివేదా.. తాజాగా ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. ఇందులో నివేదా డ్యాన్స్‌ కు ఫ్యాన్స్‌ కుషీకుషీ.

ప్రభుదేవా హీరోగా వచ్చిన గులేభకావలి సినిమాలోని సాంగ్‌కు.. నివేదా వేసిన స్టెప్స్‌ అదిరిపోయాయని అభిమానులు కామెంట్స్‌ పెడుతున్నారు. తన సోదరులతో కలిసి ఆడిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ‘మీరు పార్టీని ఎలా ఎంజాయ్‌ చేస్తారా?.. మీ హీల్స్‌ ను విసిరేయండి..వెళ్లి డ్యాన్స్‌ చేయండి’ అంటూ కామెంట్‌తో పాటు వీడియోను పోస్ట్‌ చేశారు. నిఖిల్‌ హీరోగా చేస్తోన్న‘శ్వాస’ సినిమాలో నివేదా హీరోయిన్‌గా నటిస్తున్నారు.

https://www.youtube.com/watch?v=i2pXnsVfpTA

Next Story
Share it