Telugu Gateway
Politics

రాహుల్ కాళ్ల దగ్గర టీడీపీని తాకట్టు పెట్టిన బాబు

రాహుల్ కాళ్ల దగ్గర టీడీపీని తాకట్టు పెట్టిన బాబు
X

తెలుగుదేశంపై బిజెపి ఎంపీ జీ వీ ఎల్ నర్సింహారావు మరోసారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా టీడీపీపీ స్థాపిస్తే చంద్రబాబునాయుడు ఇఫ్పడు అదే టీడీపీని రాహుల్ గాంధీ కాళ్ల దగ్గర తాకట్టుపెట్టారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు...తెలంగాణలో మహాకూటమి ఘోర వైఫల్యం చెందటం ఖాయమన్నారు. టీడీపీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేశ్‌లను అనర్హులుగా ప్రకటించాలని ఆయన పార్లమెంట్ ఎథిక్స్‌ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఎథిక్స్‌ కమిటీ సభ్యుడిగా ఉన్న సుజనా చౌదరి పైనే దర్యాప్తు సంస్థలు ఆరోపణలు చేస్తున్నందున్న.. ఆయనకు ఎంపీగా కొనసాగే అర్హత లేదన్నారు. టీడీపీ ఎంపీల అవినీతిని చూసి ప్రజలు విస్తుపోతున్నారని విమర్శించారు.

గురువారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐటీ, ఈడీ దాడుల్లో టీడీపీ నేతల అవినీతి బయటపడుతున్నా.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సిగ్గు లేకుండా వారిని సమర్థిస్తున్నారని తెలిపారు. తన బినామీలను కాపాడుకునే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు రాజకీయాల్లో విశ్వసనీయత లేదన్నారు. టీడీపీ దొంగల పార్టీ అని​ ప్రజలకు తెలిసిపోయిందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, టీడీపీ నేతలు ఆలీబాబా 40 దొంగల్లా వ్యవహరిస్తున్నారని జీవీఎల్‌ మండిపడ్డారు. లక్షల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దొంగిలిస్తే.. సంజాయిషీ అడగకూడదా అని ప్రశ్నించారు.

Next Story
Share it