Telugu Gateway
Politics

ఎన్నికల వేళ చంద్రబాబుకు గుర్తొచ్చిన మైనారిటీ..ఎస్టీలు!

ఎన్నికల వేళ చంద్రబాబుకు గుర్తొచ్చిన మైనారిటీ..ఎస్టీలు!
X

నాలుగున్నర సంవత్సరాలు తన ప్రభుత్వంలో మైనారిటీలు..ఎస్టీలు లేరనే విషయం ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడికి గుర్తులేదు. కానీ సడన్ గా ఎన్నికలకు ఇంకా సరిగ్గా ఆరు నెలలు కూడా సమయం లేని సమయంలో ఈ రెండు సామాజిక వర్గాలకు అన్యాయం జరిగిందని చంద్రబాబు గుర్తించారా?. మారిన పరిస్థితుల్లో చంద్రబాబు ఏ రిస్క్ తీసుకోవటానికి సిద్ధంగా లేరు. వచ్చే ఎన్నికల్లో గెలుపు తీరాలకు చేరాలంటే ప్రతి ఒక్క వర్గమూ కీలకమే. రాజకీయంగా ఒంటరైన చంద్రబాబు..ఎవరూ ఊహంచని రీతిలో కాంగ్రెస్ కూటమిలో చేరిపోయారు. తెలుగుదేశంలోని పాత తరం నాయుకులు ఈ పరిణామాలు ఊహించని పరిణామం అయినా..రాజకీయ, ఆర్థిక అవసరాల కోసం మౌనం దాల్చారు.

నిజంగా చంద్రబాబుకు ఈ సామాజిక వర్గాలపై అంత ప్రేమ ఉంటే పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరూ లేకపోయినా ఎమ్మెల్సీ పదవి ఇఛ్చి..మంత్రి ఇవ్వొచ్చు. అచ్చం యనమల రామకృష్ణుడు, పి. నారాయణ, నారా లోకేష్ లకు ఇఛ్చినట్లు ఇవ్వొచ్చు. కానీ ఆ పని చేయలేదు. ఎందుకంటే అప్పుడు అది అవసరం కాదు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇది అవసరం. అందుకే చంద్రబాబు రూట్ మార్చారు. అకస్మాత్తుగా మైనారిటీలు..ఎస్టీలపై ప్రేమ కురిపిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే ఫరూక్ కు, ఇటీవలే మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన కిడారి సర్వేశ్వరరావు తనయుడు శ్రావణ్ కు మంత్రి పదవులు కట్టబెట్టారు. మరి చంద్రబాబు ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో వేచిచూడాల్సిందే.

Next Story
Share it