Telugu Gateway
Andhra Pradesh

‘ఐటి’ పేరుతో మంత్రి అల్లుడి లూటీ!

‘ఐటి’ పేరుతో మంత్రి అల్లుడి లూటీ!
X

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఐటి దాడులను కూడా ఆయన తన అక్రమార్జనకు వాడుకుంటున్నారు. ఆయన ఎవరో కాదు..సాక్ష్యాత్తూ ఏపీ ప్రభుత్వంలో కీలక శాఖకు చెందిన ఓ మంత్రి అల్లుడు కావటం విశేషం. గత కొంత కాలంగా ఆయన తీవ్ర వివాదాల్లో చిక్కుకుంటున్నాయి. అయినా సరే తన ‘దోపిడీ స్కీమ్’లను అలాగే కొనసాగిస్తున్నారు. ఈ వ్యవహారం చూసి సచివాలయంలో ఉన్నతాధికార వర్గాలు షాక్ కు గురవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం విజయవాడ కేంద్రంగా ఉండే ఓ రియల్ ఎస్టేట్ సంస్థపై ఐటి దాడులు జరిగాయి. కంపెనీలో అక్రమ లావాదేవీలను ఐటి శాఖ అధికారులు గుర్తించారు. దీంతో సదరు సంస్థ ప్రతినిధులు ఓ మంత్రి అల్లుడిని సంప్రదించారు. కేసు కాకుండా చూసేందుకు తనకు తొలుత 40 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరగా..తొలి విడత సదరు కంపెనీ ప్రతినిధులు 25 లక్షలు ఇఛ్చారు.

తర్వాత ఐటి శాఖ అధికారులు ఏకంగా కంపెనీపై కోటిన్నర పెనాల్టీ వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రతినిధులు లబోదిబో మంటూ మంత్రి అల్లుడి దగ్గరికి పరుగెత్తికెళ్లారు. భారీ జరిమానా లేకుండా చూస్తామన్నారు కదా?. ఇదేంటి అని ప్రశ్నిస్తే..తాను చెప్పబట్టే అంత తక్కువ జరిమానా వేశారని..లేదంటే ఆ మొత్తం మరింత పెరిగి ఉండేదని ఆయన వ్యాఖ్యానించటంతో అవాక్కు అవటం కంపెనీ ప్రతినిధులు వంతు అయింది. ఓ వైపు ఐటి శాఖకు జరిమానా కట్టాల్సి రావటం, మరో వైపు మంత్రి అల్లుడికి కూడా 25 లక్షల ‘ఫైన్’ కట్టిన కంపెనీ ప్రతినిధులు సదరు అల్లుడి వ్యవహారంపై సీరియస్ గా ఉన్నారు.

Next Story
Share it