Telugu Gateway
Cinema

జనవరిలో ‘మిస్టర్ మజ్ను’

జనవరిలో ‘మిస్టర్ మజ్ను’
X

అక్కినేని అఖిల్ కొత్త సినిమా రెడీ అయింది. జనవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా హీరో అఖిల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. హిట్ కోసం తపిస్తున్న ఈ కుర్ర హీరో ప్రస్తుతం మిస్టర్ మజ్నులో నటిస్తున్న సంగతి తెలిసిందే. వెంకీ అ‍ట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సవ్యసాచి ఫేం నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

‘ప్రస్తుతం మిస్టర్‌ మజ్ను సినిమా ప్యాచ్‌వర్క్‌ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. డిసెంబర్‌ 3తో ఒక్క పాట మినహా షూటింగ్ అంతా పూర్తవుతుంది. జనవరిలో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాం. ఇన్నాళ్లు ఓపిగ్గా ఎదురుచూసినందుకు థ్యాంక్స్‌’ అంటూ ట్వీట్‌ చేశాడు అఖిల్‌. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీయస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతమందిస్తున్నాడు.

Next Story
Share it