రజనీకాంత్ 2.ఓ తెలుగు సెన్సార్ పూర్తి
BY Telugu Gateway24 Nov 2018 11:20 AM IST
X
Telugu Gateway24 Nov 2018 11:20 AM IST
వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చిన ప్రతిష్టాత్మక సినిమా 2.ఓ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా సెన్సార్ పూర్తిచేసుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది. ఎక్కడ చూసినా ప్రస్తుతం 2.ఓ ఫీవర్ నడుస్తోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం సినిమా దర్శకుడు శంకర్ కావటం..ఇందులో రజనీకాంత్, అక్షయ్ కుమార్ వంటి స్టార్స్ ఉండటం.
ఈ సినిమాలో రజనీకి జోడీగా అమీజాక్సన్ నటిస్తోంది. అద్భుతమైన గ్రాఫిక్స్ నైపుణ్యంతో తెరకెక్కిన ఈ విజువల్ వండర్ ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా 2.ఓ తెలుగు వర్షన్ సెన్సార్ కూడా పూర్తయ్యింది. సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికేట్ను జారీ చేసింది. భారీ గ్రాఫిక్స్ తో తెరకెక్కిన ఈ సినిమా రన్ టైం 2 గంటల 29 నిమిషాలుగా ఫిక్స్ చేశారు.
Next Story