జగన్ హత్యకు షర్మిల..విజయమ్మ కుట్ర
ఇది తెలుగుదేశం నేత, ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ చేసిన ఆరోపణ. గత కాలంగా పార్టీలో విజయమ్మను, షర్మిలను జగన్ అణగదొక్కుతున్నారని..అందుకే వాళ్లిద్దరూ
వైసీపీ కార్యకర్త అయిన శ్రీనివాసరావుతో ఈ హత్యకు కుట్ర చేశారని ఆరోపించారు. జగన్ ఈ దాడిలో ప్రాణాలు కోల్పోతే పార్టీలో కీలక పదవులు వాళ్ళిద్దరికే వస్తాయని
అందుకే అలా చేసి ఉండొచ్చని వ్యాఖ్యానించారు. జగన్ మరణిస్తే సానుభూతి ఓట్లతో గద్దె ఎక్కాలని విజయమ్మ, షర్మిల కుట్రపన్నారనే అనుమానం కలుగుతోందన్నారు. ఇలాంటి వ్యాఖ్యల ద్వారా టీడీపీ నేతలు తమ పరువును మరింత తీసుకుంటున్నారనే విమర్శలు విన్పిస్తున్నాయి. జగన్ పై దాడి జరిగిన వెంటనే ఏపీ ముఖ్యమంత్రి
చంద్రబాబునాయుడు, డీజీపీ ఠాకూర్ లు దాడి చేసిన వ్యక్తి శ్రీనివాసరావు వైసీపీ కార్యకర్త అని తేల్చేశారు.
అది చిన్న దాడే అని..సానుభూతి కోసమే ఇలా చేశారని బహిరంగంగా చెప్పారు.
కానీ ఏపీ పోలీసులు మాత్రం జగన్ పై జరిగింది హత్యాయత్నమే అని తమ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఆ కత్తి జగన్ మెడకు తగిలి ఉండే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. దీంతో చంద్రబాబు, డీజీపీల వాదన వీగిపోయినట్లు అయింది. ఇప్పుడు పార్టీ ఎమ్మెల్సీ ఏకంగా జగన్ సోదరి షర్మిల, తల్లి విజయమ్మపై తీవ్ర వ్యాఖ్యలు చేయటంతో అసలు తెలుగుదేశం పార్టీకి..ఆ నేతలకు ఏమైంది? అన్న సందేహం కలుగుతోంది.