Telugu Gateway
Andhra Pradesh

తెలుగుదేశం వెబ్ సైట్ ఇప్పుడే డౌన్ ఎందుకైంది?.

తెలుగుదేశం వెబ్ సైట్ ఇప్పుడే డౌన్ ఎందుకైంది?.
X

తెలుగుదేశం పార్టీ వెబ్ సైట్ సడన్ గా ఇప్పుడే ఎందుకు డౌన్ అయింది. టీడీపీ వెబ్ సైట్ ఓపెన్ చేస్తే ఎర్రర్ అని ఎందుకొస్తోంది. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో దాడి చేసిన శ్రీనివాసరావు తెలుగుదేశం కార్యకర్తే అని ..ఇదే ఆయన గుర్తింపు కార్డు సోషల్ మీడియాలో ఆదివారం హల్ ఛల్ చేయటం ప్రారంభించింది. అది నిజమా?. ఫేకా అన్నది మాత్రం ఎవరీకీ తెలియదు. శ్రీనివాసరావుతో పాటు ఆయన సోదరుడు జానిపల్లి సుబ్బరావు టీడీపీ సభ్యత్వ కార్డు కూడా సోషల్ మీడియా, వాట్సప్ ల్లో తెగ తిరుగుతోంది. తెలుగుదేశం అధికారిక వెబ్ సైట్ అయిన Telugudesam.org ద్వారా ఈ వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది.ఆ పనిచేస్తారనే ఇప్పుడు తెలుగుదేశం వెబ్ సైట్ ను డౌన్ చేశారా?. ఆ వివరాల డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ పునరుద్ధరిస్తారా?. ప్రస్తుతం టీడీపీ టీమ్ ఆ వివరాలు డిలీట్ చేసే పనిలో ఉందా?. ఇప్పుడు అవే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వార్త రాసే సమయంలో తెలుగుదేశం వెబ్ సైట్ ఓపెన్ చేసే ప్రయత్నం చేయగా..ఎర్రర్ అని వస్తున్న పోటోనే పైన ఐటెంలో పెట్టడం జరిగింది. జగన్ పై విమానాశ్రయంలో దాడి జరిగిన గంటల వ్యవధిలోనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొదలుకుని డీజీపీ వరకూ జగన్ పై దాడి చేసింది ఆయన అభిమానే అని ప్రకటించి కలకలం రేపారు. అసలు గంటల వ్యవధిలోనే విచారణ జరక్కుండానే అలా కేసును తేల్చేస్తారా?. అలా చెపితే ప్రజలు నమ్మేస్తారా?. ఈ విషయాలన్నీ పట్టించుకోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు, డీజీపీ ఠాకూర్ మొదలుకుని టీడీపీ నేతలందరూ ఒకే పాట పడారు.

దాడిచేసిన వ్యక్తి జగన్ అభిమాని అని. కానీ ఇప్పుడు వెలుగులోకి వస్తున్న అంశాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. అసలు దాడి చేసిన వ్యక్తి ఏ పార్టీతో సంబంధం ఉంది?. దాడి వెనక కారణాలు ఏంటి అనే విషయాలు నిష్పక్షపాత విచారణ జరిపితే తప్ప వెలుగులోకి వచ్చే అవకాశం లేదు. కానీ ఏపీలో ప్రస్తుతం ఆ పరిస్థితి ఉందని ఆశించటం అత్యాశే అవుతుంది. ఎందుకంటే చంద్రబాబు గత కొంత కాలంగా ఏ సంఘటన జరిగినా..నేరం జరిగినా దీనికి వెనక వైసీపీ లేదా బిజెపి ఉందని వ్యాఖ్యానించటం అలవాటు అయిపోయింది. పోనీ ఆ విషయాన్ని ఆధారాలతో సహా ఏమైనా నిరూపిస్తారా? అంటే అదీ లేదు. చూడాలి మరి తాజా ఉదంతం ఎన్ని మలుపులు తిరుగుతుందో?.

Next Story
Share it