Telugu Gateway
Cinema

సీఎం సహాయ నిధికి విజయ్ దేవరకొండ విరాళం 5 లక్షలు

సీఎం సహాయ నిధికి విజయ్ దేవరకొండ విరాళం 5 లక్షలు
X

హీరో విజయ్ దేవరకొండ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. తిత్లి తుఫాన్ తో అల్లకల్లోలం అయిన శ్రీకాకుళం జిల్లాను ఆదుకునేందుకు ఈ హీరో తన వంతుగా ఐదు లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. ఈ మొత్తాన్ని ఆయన సీఎం సహాయ నిధికి పంపారు. అంతే కాదు..గతంలో తనతో కలసి కేరళకు సాయం చేసిన తరహాలోనే మన సొంత ప్రజలు కష్టాల్లో చిక్కుకున్నందున వారికి సాయం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ మేరకు సోషల్ మీడియాలో తాను నగదు బదిలీ చేసిన వివరాలతో పాటు ఫ్యాన్స్ కు ఓ పిలుపునిచ్చారు. తిత్లి తుఫాన్ కారణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ కు అండగా నిలవాలని కోరారు. ఇప్పటి వరకూ ఏ స్టార్ హీరో కూడా ముందుకు రాని సమయంలో విజయ్ దేవరకొండ ముందుకొచ్చి సాయం ప్రకటించటంతో ఆయనకు అభిమానుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Next Story
Share it