‘ముగ్గురు భామల’తో విజయ్ రొమాన్స్
BY Telugu Gateway13 Oct 2018 9:39 AM IST

X
Telugu Gateway13 Oct 2018 9:39 AM IST
ఒక్కరు కాదు..ఇద్దరు కాదు..ఏకంగా ముగ్గురు. అది విజయ్ దేవరకొండ సినిమాలో. ఇప్పుడు విజయ దేవరకొండతో సినిమా అంటే చాలు..ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేయాల్సిందే. ఎందుకంటే విజయ్ కు టాలీవుడ్ లో అంత క్రేజ్ ఉంది మరి ప్రస్తుతం. క్రియేటివ్ కమర్షియల్స్ ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. సుదీర్ఘ విరామం తర్వాత క్రియేటివ్ కమర్షియల్స్ మళ్ళీ ఇప్పుడు వరస పెట్టి సినిమాలు చేస్తోంది.
విజయ్ హీరోగా తెరకెక్కే ఈ కొత్త సినిమాకు క్రాంతిమాధవ్ దర్శకత్వం వహించనున్నారు. కె ఏ వల్లభ నిర్మాత. ఈ సినిమాలో విజయ్ తో రొమాన్స్ చేయనున్న వారిలో రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఇసా బెల్లే ఉన్నారు. కొత్త సినిమా ఈనెల 18న హైదరాబాద్లో ప్రారంభం కానుంది. ప్రముఖ నిర్మాత కేఎస్ రామారావు సమర్పిస్తున్నారు. ప్రేమ కథగా ఈ సినిమా తెరకెక్కనుంది.
Next Story