Telugu Gateway
Politics

రాహుల్ తో డీఎస్ భేటీ..ఏమి మాట్లాడానో ఎందుకు చెబుతా?

రాహుల్ తో డీఎస్ భేటీ..ఏమి మాట్లాడానో ఎందుకు చెబుతా?
X

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో టీఆర్ఎస్ ఎంపీ డి. శ్రీనివాస్ సమావేశం అయ్యారు. ఒకప్పటి కాంగ్రెస్ సీనియర్ నేత అయిన డీఎస్ తర్వాత అధికార టీఆర్ఎస్ లో చేరి రాజ్యసభ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే గత కొంత కాలంగా డీఎస్ పార్టీ అధిష్టానం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో డీఎస్ ఢిల్లీలో రాహుల్ తో భేటీ కావటం ఆసక్తికర పరిణామంగా మారింది. భేటీ అనంతరం డీఎస్ మీడియాతో మాట్లాడుతూ రాహుల్ తో ఏమీ మాట్లాడింది మీడియాకు ఎందుకు చెబుతానని ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారా? అన్న ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వలేదు. పైగా కాంగ్రెస్ లో చేరానని మీకు ఎవరు చెప్పారు?. చాలా మంది నేతలను కలుస్తున్నా. అందులో భాగంగానే రాహుల్ ను కూడా కలిశా అంటూ సస్పెన్స్ ను కొనసాగిస్తున్నారు. ఇంచు మించు డీఎస్ కలిసిన సమయంలో తెలంగాణకు చెందిన నేతలు నర్సారెడ్డి, ఎమ్మెల్సీ రాములు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అధికారికంగా కాంగ్రెస్ లో చేరితే రాజ్యసభ సభ్యత్వం కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే ఇలా చేసినట్లు భావిస్తున్నారు.

Next Story
Share it