Telugu Gateway
Telangana

ఆర్మూర్ జీవన్ రెడ్డిపై సంచలన వీడియో

ఆర్మూర్ జీవన్ రెడ్డిపై సంచలన వీడియో
X

టీఆర్ఎస్ ఎమ్మెల్యే పార్క్ హయత్ కు రమ్మన్నాడు

టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తనను పార్క్ హయత్ కు రమ్మన్నారని శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు..జీవన్ రెడ్డికి సంబంధించిన పలు అంశాలను ఆమె తమిళ్ కు చెందిన ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ వ్యవహారం ఇఫ్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపుతోంది. ‘ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నన్ను వేధించారు. జీవన్ రెడ్డి వెనక వేరే వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళెవరో నాకు క్లారిటీ లేదు. జీవన్ రెడ్డి మాత్రం బిగ్ ఫ్రాడ్. అతన్ను చాలా మందిని పార్క్ హయత్ కు రమ్మంటాడు. నన్ను ఒక్క దాన్నే కాదు. ఈ కేసులో బెల్లంకొండ సురేష్ కూడా భాగస్వామే. బెల్లంకొండ సురేష్ ప్రొడ్యూసర్. బెల్లంకొండ సురేష్ ఫ్రెండ్స్ లో నా ఫ్రెండ్ కూడా ఒకరున్నారు. నేను కూడా ఓ సారి పార్క్ హయత్ కు వెళ్ళాను. ఆ సమయంలో జీవన్ రెడ్డిని కలిశాను.

నా ఫ్రెండ్స్ చాలా మంది పార్క్ హయత్ కు వెళ్లారు. అతను చాలా మంది యువతులను అనుభవించాడు. చాలా సినిమాలకు నేను స్లీపింగ్ ప్రొడ్యూసర్ గా ఉన్నానని జీవన్ రెడ్డి చెప్పారు. మా దగ్గర చాలా బ్లాక్ మనీ ఉంది. దాన్ని సినిమాల్లో పెడుతున్నాం. మేం చెపితే రామ్ చరణ్ తేజ్,,ప్రభాస్ అయినా చేయాల్సిందే. ఎందుకంటే మేం ప్రభుత్వంలో ఉన్నాం. అందుకే ఎవరైనా మాతో గడపాల్సిందే అని చెప్పారు. నాకు కొంత సమయం కావాలని కోరా. నేను ప్రతివతను అని చెప్పటం లేదు. ఆ రోజు ఎందుకో నాకు కంఫర్టబుల్ గా అన్పించలేదు. అయినా ఆయన చెప్పింది ఎంత వరకు నిజమో తెలియదు.రాజకీయ నాయకులు చెప్పే మాటలను గుడ్డిగానమ్మలేం. అందుకే నేను కొంత సమయం అడిగా. అయినా ఆయన చాలాసార్లు నాకు ఫోన్ చేశారు.’ అని సంచలన విషయం వెల్లడించారు. ఎన్నికల సమయంలో వెలువడిన ఈ వీడియో దుమారం రేపటం ఖాయంగా కన్పిస్తోంది.

Next Story
Share it