చంద్రబాబు కోసం వెతుకుతున్న వర్మ
అవును. ఇది నిజం. ఈ మధ్య ఓ వీడియో చక్కర్లు కొట్టింది. ఓ వ్యక్తి మెస్ లో పనిచేస్తున్నారు. ఆయన్ను చూస్తే అచ్చం చంద్రబాబులా ఉన్నారు. అందుకే కాబోలు అక్కడ ఉన్న వారు ఆయన వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేశారు. అది ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. పక్కన పెట్టిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను మళ్ళీ తెరపైకి తెస్తున్నట్లు ప్రకటించారు రామ్ గోపాల్ వర్మ. ఈ సమయంలోనే ఆ వీడియో కూడా వచ్చింది. ఈ వీడియోలో ఉన్న చంద్రబాబు పోలికల వ్యక్తి ఆచూకి చెపితే లక్ష రూపాయల బహుమతి ఇస్తానని ప్రకటించారు వర్మ. తొలుత చెప్పిన వారికే ఆ ఛాన్స్ అంటూ ఈ మెయిల్ అడ్రస్ ఇచ్చారు. అంటే ఈ డూప్ బాబును వర్మ తన లలక్ష్మీస్ ఎన్టీఆర్ లో వాడుకోవాలని డిసైడ్ అయిపోయినట్లే కన్పిస్తోంది. వీడియోలో ఉన్న ‘ఈ వ్యక్తిని వెతికి పట్టుకోవటంలో ఎవరైనా నాకుసాయం చేస్తారా.? అతన్ని నాకు టచ్‌లోకి తీసుకువచ్చిన వారికి లక్ష రూపాయల రివార్డ్ అందిస్తా.’ అంటూ వర్మ ఆ వీడియోను తన ట్విటర్‌పేజ్ లో పోస్ట్ చేశాడు.
చాలా రోజులు క్రితం వర్మ ప్రకటించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను అక్టోబర్19 నుంచి ప్రారంభించనున్నాడు. ఎన్టీఆర్ జీవితంలోని కీలక సంఘటనల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.చూడాలి మరి వర్మకు ఈ డూప్ చంద్రబాబు దొరుకుతాడా..లేదా? ఓ వైపు బాలక్రిష్ణ సినిమా జెట్ స్పీడ్ లో సాగుతుంది. అందులో వివాదస్పద అంశాలు ఏమీ ఉండే అవకాశం లేదు. కానీ వర్మ మాత్రం ఈ సినిమాలకు పోటీగా కావాల్సినంత హంగామా చేయటానికి రెడీ అయిపోయినట్లే కన్పిస్తోంది. వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ఎంత వివాదం రేపుతుందో చూడాల్సిందే.