Telugu Gateway
Cinema

పెద్ద పెద్ద కళ్ళతోటి ప్రణీత

పెద్ద పెద్ద కళ్ళతోటి ప్రణీత
X

ప్రణీత. నిజంగానే ఈ భామ కళ్ళు చాలా పెద్దగా ఉంటాయి. అందుకే కాబోలు రచయిత కూడా ఆమె కళ్ళను టార్గెట్ చేసి పాట రాసినట్లు ఉన్నారు. ఇదంతా ఎక్కడ అంటారా?. హలో గురూ ప్రేమ కోసమే సినిమాలో హీరో రామ్, ప్రణీలపై వచ్చే పాట ఇది. ఈ పాట ప్రమోను హీరో సోమవారం నాడు విడుదల చేశారు. అంతే కాదు..ఇందులో ఓ కొత్త విశేషం కూడా ఉంది. అదేంటి అంటే దక్షిణాదిలో తొలిసారి పాపింగ్ డ్యాన్స్ తో పాట విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

భవిష్యత్ లో కూడా ఈ ట్రెండ్ కొనసాగిస్తానని పేర్కొన్నారు. హలో గురూ ప్రేమ కోసమే సినిమా దసరా రోజు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో హీరో రామ్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మధ్య వచ్చే డైలాగులు ఆసక్తికరంగా ఉన్నాయి. సినిమా టీజర్, ట్రైలర్ ను చూస్తే హలో గురూ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. నక్కిన త్రినాధరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు నిర్మాత దిల్ రాజు. ఈ సినిమాలో ప్రణీత తోపాటు ప్రకాష్ రాజ్ తదితరుల ఇతర కీలకపాత్రలు పోషించారు.

https://www.youtube.com/watch?v=pFcOFB2CK-c

Next Story
Share it