రామ్ చరణ్ కొత్త సినిమా టైటిల్ అదేనా?

రంగస్థలం సినిమా సూపర్ హిట్ తర్వాత రామ్ చరణ్ బోయపాటి శ్రీనుదర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ తో కలసి చేసే సినిమా షూటింగ్ కు రెడీ అవుతున్నారు. అయితే రామ్ చరణ్ కొత్త సినిమా పేరును వెరైటీగా వినయ విధేయ రామ గా నిర్ణయించనట్లు ప్రచారం జరుగుతోంది. అధికారికంగా చిత్ర యూనిట్ నుంచి అయితే ఎలాంటి ప్రకటన లేదు. దసరాకు సినిమా ఫస్ట్ లుక్ తో పాటు..టైటిల్ ను కూడా వెల్లడించవచ్చని అంచనా. ఈ సినిమాను 2019 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ‘వినయ విధేయ రామ’ అనే టైటిల్ను నిర్మాత డీవీవీ దానయ్య ఈ టైటిల్ను ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ చేయించినట్టు సమాచారం. బోయపాటి గత చిత్రం జయ జానకి నాయక టైటిల్ తరహాలోనే ఈ సినిమాకు కూడా క్లాస్ టైటిల్ను నిర్ణయించే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది.