Telugu Gateway
Cinema

అర కిలోమీటర్ దూరం నుంచి ప్రేమిస్తుంటే....!

అర కిలోమీటర్ దూరం నుంచి ప్రేమిస్తుంటే....!
X

‘ఏదో నా పాటికి నేను అరకిలోమీటర్ దూరం నుంచి ప్రేమిస్తూ బతికేస్తుంటే..మీరు ఇలా దగ్గరకొచ్చి మాట్లాడటం ఏమీ బాగాలేదండీ’. ఇదీ హీరోయిన్ సాయిపల్లవితో హీరో శర్వానంద్ చెప్పే డైలాగ్. ‘పడి పడి లేచే మనసు’ సినిమాకు సంబంధించిన టీజర్ ను చిత్ర యూనిట్ బుధవారం నాడు విడుదల చేసింది. ఈ టీజర్ యూత్ ను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. సాయిపల్లవి ఎటు వెళుతుంటే..హీరో శర్వానంద్ కూడా అక్కడ ప్రత్యక్షం అవుతుంటాడు. ఈ సమయంలో జరిగే సీన్లే టీజర్ లో ఆకర్షణీయంగా చూపించారు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. శర్వానంద్ విభిన్న కథాంశాలతో కూడిన చిత్రాలు చేస్తూ మంచి సక్సెస్ లు సాధిస్తున్నారు. సాయి పల్లవికి కూడా పరిశ్రమలో మంచి గుర్తింపు ఉంది. వీరిద్దరి కాంబినేషన్ సినిమా..అదీ లవ్ స్టోరీ అంటే సహజంగానే యూత్ లో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. టీజర్ ఈ అంచనాలను మరింత పెంచిందనే చెప్పొచ్చు.

https://www.youtube.com/watch?v=O7oOl5oyTQg

Next Story
Share it