నాని కొత్త సినిమా షురూ
BY Telugu Gateway17 Oct 2018 3:49 PM IST
X
Telugu Gateway17 Oct 2018 3:49 PM IST
న్యాచురల్ స్టార్ నాని కొత్త సినిమా మొదలైంది. జెర్సీ సినిమా ప్రారంభోత్సవానికి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఈ సినిమాలో నానికి జోడీగా కన్నడ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాధ్ నటిస్తోంది. ఆమె కన్నడ యూటర్న్ సినిమాలో నటించారు. బుధవారం ఉదయం ఫిల్మ్ నగర్‌లోని సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభమైంది.
దసరా రోజు నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సత్యరాజ్, బ్రహ్మాజీ, రోనిత్ కామ్రా ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతమందిస్తున్న ఈ సినిమాకు మళ్ళీరావా ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకుడు.
Next Story