Telugu Gateway
Andhra Pradesh

సీఎం చంద్రబాబు కంటే నారాయణ కాన్వాయ్ హంగామా!

సీఎం చంద్రబాబు కంటే నారాయణ కాన్వాయ్ హంగామా!
X

ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ అమరావతిలో తనిఖీ అంటే చాలు..పోలీసులు..సీఆర్ డీఏ అధికారులు హడలిపోతున్నారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు తనిఖీకి వచ్చిన ఓ 50 కార్ల కాన్వాయ్ హంగామా చేస్తుందని సీఆర్ డీఏ వర్గాలు తెలిపాయి. అమరావతి ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణాల తనిఖీకి ఆయన ఆ ప్రాంతానికి తరచూ వెళుతున్నారు. అదేమీ తప్పు కాదు. పోనీ ఆయన అక్కడ ఏమైనా ఎక్కువ సేపు ఉండి..జరుగుతున్న పనులను పరిశీలిస్తారా అంటే అదీ లేదు. నిర్మాణ కంపెనీల ప్రతినిధులందరిని తన సమీక్షలకు పిలవటం..వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో అక్కడికి రావటం. బాగా చేయండి అని..అక్కడ అల్పాహారం తీసుకుని ఓ పది నిమిషాల్లో అక్కడి నుంచి వెళ్ళిపోవటం. ఇది పరిపాటిగా మారిందని చెబుతున్నారు అదికారులు. నారాయణ వాహనాలతోపాటు..కంపెనీల ప్రతినిధులు అందరూ వస్తుండటంతో రాజధాని గ్రామాల్లో నారాయణ హంగామా చూసి ప్రజలు కూడా అవాక్కు అవుతున్నారు. ఇంత వరకూ శాశ్వత నిర్మాణాలు ఒక్కటీ పనులు మొదలుపెట్టలేదు కానీ...నారాయణ హంగామా అంతా ఇంతా కాదు అంటూ తూళ్ళూరు ప్రాంత ప్రజలు కూడా ఆయన తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాలను అత్యంత నాసిరకంగా నిర్మించి తీవ్ర విమర్శలు పాలు అయ్యారు మంత్రి నారాయణ. అసెంబ్లీలో అయితే కనీసం ఛాంబర్లు అత్యంత దారుణంగా ఉండటం.. సరైన టాయిలెట్ల వసతి కూడా లేకుండా చేశారు. అదొక్కటే కాదు..ఓ మాంచి వర్షం కురిసింది అంటే...చాలు సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాల్లోనూ జలపాతాల అనుభూతిని అందరూ ప్రత్యక్షంగా చూశారు. పోనీ వ్యయం అయినా తక్కువ అయిందా? అంటే అదీ లేదు. ఏభై కోట్ల రూపాయలుపైనే చెల్లించాల్సిన వ్యయం కంటే అదనపు వ్యయం చేశారు. అయినా సరే అంతా నాసిరకమే. అంత చేసినా చంద్రబాబునాయుడు తనకు అత్యంత అత్మీయుడైన నారాయణనను ఒక్కటంటే ఒక్క మాట అన్న దాఖలా లేదు. ఇప్పుడు ఆయన నిత్యం తనిఖీలు చేస్తున్న భవనాల నిర్మాణాలు ఎలా ఉన్నాయో అవి పూర్తయితే కానీ తెలియదు.

Next Story
Share it