‘మీ టూ’లో పడిన బిగ్ వికెట్..ఎం జె అక్భర్ రాజీనామా

‘మీ టూ’ వ్యవహారం దేశాన్ని కుదిపేస్తోంది. దీనికి సంబంధించి బుధవారం నాడు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇంత కాలం తాను ఈ విషయంలో న్యాయ పోరాటం చేస్తానని ప్రకటించిన కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ఎం జె అక్బబర్ తన పదవికి రాజీనామా చేశారు. జర్నలిస్టుగా ఉన్న సమయంలో ఎంతో మంది మహిళా జర్నలిస్టులను వేధించినట్లు ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆరోపణలను ఖండించిన అక్బర్ న్యాయ పోరాటానికి రెడీ అవటమే కాకుండా..తొలుత ఆయనపై ఆరోపణలు చేసిన ప్రియా రమణి లీగల్ నోటీసులు కూడా పంపారు. అంతే కాదు..కేవలం ఎన్నికల ముందు కావాలనే ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. వ్యక్తిగత స్థాయిలో ఈ పోరాటాన్ని ఎదుర్కొంటానని..అందుకే మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు.
తనకు అత్యంత కీలకమైన బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోడీకి..తనకు సహకరించిన కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్వా స్మరాజ్ కు ధన్యవాదాలు తెలిపారు. ఎం జె అక్భర్ పై ఒక్కరు కాదు...ఇద్దరు కాదు పదుల సంఖ్యలో మహిళా జర్నలిస్టులు ఆరోపణలు చేశారు. లైంగిక వేదింపుల ఆరోపణల కేసులో ఓ మంత్రి తన పదవికి రాజీనామా చేయటం కలకలం రేపుతోంది. ప్రియ రమణికి లీగల్ నోటీసులు ఇవ్వటంతో 20 మంది మహిళా జర్నలిస్టులు మూకుమ్మడిగా ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ..తాము కూడా ఆయనపై ఆరోపణలు నిరూపిస్తామని ముందుకొచ్చారు. దీంతో వ్యవహారం మరింత ముదిరే అవకాశం ఉండటంతో ప్రభుత్వమే పరోక్షంగా రాజీనామా చేయాల్సిందిగా సూచించినట్లు వార్తలు వస్తున్నాయి.



