కొండ చిలువతో కాజల్
తెలుగు తెరపై దశాబ్దంగా సందడి చేస్తున్న హీరోయిన్ కాజల్. కాజల్ కెరీర్ ముగిసిపోయింది అని ప్రచారం అలా జరుగుతూనే ఉంటుంది. ఆమెకు అలా అవకాశాలు వస్తూనే ఉంటాయి. అదే కాజల్ స్పెషాలిటీ. ఖైదీ నెంబర్ 150లో చిరంజీవితో కలసి సందడి చేసింది ఈ భామ. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావటంతో కాజల్ కు కూడా లక్ కలిసొచ్చింది. ఓ వైపు సీనియర్ హీరోలతోపాటు..మరో వైపు జూనియర్ హీరోలతోనూ సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో ఇంకా తన హవా తగ్గలేదని నిరూపించకుంటోంది. ప్రస్తుతం ఈ చందమామ హీరోయిన్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో కలిసి ఓ సినిమాలో చేస్తోంది.
తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం థాయ్‌లాండ్‌లోని నఖోమ్ పాథోమ్ ప్రావిన్స్‌లో జరుగుతోంది. షూటింగ్ అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సందడి చేస్తున్న చిత్రయూనిట్ తాజాగా ఓ ఆసక్తికర వీడియోను పోస్ట్ చేశారు. హీరోయిన్ ఓ భారీ కొండచిలువను మెడలో వేసుకొని కెమెరాకు ఫోజ్ ఇస్తున్న వీడియో సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతుంది. దర్శకుడు తేజ తన ఇన్స్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఈ వీడియోను షేర్ చేశాడు.
https://www.youtube.com/watch?v=tVbRdk4bX2E