జనసేన కవాతు సక్సెస్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తలపెట్టిన ‘కవాతు’ సక్సెస్ అయింది. ఈ కవాతులో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున జనసైనికులు హాజరయ్యారు. వాస్తవానికి తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారెజ్ పై తలపెట్టిన ఈ కవాతులో పవన్ కళ్యాణ్ కూడా నడవాల్సి ఉంది. కానీ హాజరైన జన సందోహంతో ఆ పరిస్థితి లేకపోవటంతో పవన్ కారులో నుంచే కవాతుకు హాజరైన వారికి అభివాదం చేస్తూ..ముందుకు సాగారు. ఆ తర్వాత బహిరంగ సభలో వివిధ అంశాలపై మాట్లాడారు.
ధవళేశ్వరం బ్యారెజ్ వద్ద నిర్వహించిన బహిరంగ సభకు కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. దీంతో జనసేన నాయకుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. జనసేనకు ఉభయ గోదావరి జిల్లాల్లో మంచి పట్టు ఉన్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ కూడా గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రపై ఫోకస్ పెట్టినట్లు కన్పిస్తోంది. ఈ కవాతు సక్సెస్ తో జనసేనలో కొత్త జోష్ వచ్చినట్లు అయిందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.