Top
Telugu Gateway

ఏపీ ఐఏఎస్ ల్లో టెన్షన్ టెన్షన్!

ఏపీ ఐఏఎస్ ల్లో టెన్షన్ టెన్షన్!
X

ఏపీలో మూకుమ్మడిగా సాగుతున్న ఐటి దాడులు కీలక శాఖల్లోని అధికార వర్గాల్లో కూడా వణుకు పుట్టిస్తోంది. ఈ దాడులు ప్రారంభమైనప్పటి నుంచి అత్యంత కీలకమైన శాఖకు చెందిన ఓ మంత్రి..ఐఏఎస్ తో పాటు కొంత మంది ఇంజనీర్లు కూడా టెన్షన్ తో వణికిపోతున్నట్లు సమాచారం. ఆ శాఖలోని ఐఏఎస్ అధికారి ప్రభుత్వం చెప్పిన పనులు అన్నీ చేస్తూ భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు వెళ్ళాయి. ఐఏఎస్ ల్లో కూడా ఈ అంశంపై విస్తృతం చర్చ నడుస్తోంది. ఐటి అధికారులు ఏ క్షణాన తమ ఇంటి తలుపు తడతారో అన్న టెన్షన్ కొంత మంది అవినీతి అధికారుల్లో ఉంది. అదే శాఖకు చెందిన మంత్రిదీ అదే పరిస్థితి.

అప్పటివరకూ ఎంతో స్నేహంగా ఉన్న నలుగురు స్నేహితులు మంత్రికి దూరమయ్యారు. వాళ్లలో కొంత మందే సదరు మంత్రికి సంబంధించిన నల్ల డబ్బు ‘పార్కింగ్’ విషయాలను ఐటి శాఖ అధికారులకు ఉప్పందించారని జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో ఆయనలో కూడా ఎక్కడలేని టెన్షన్ మొదలైంది. ఏ క్షణాన అయినా ఐటి అధికారులు దాడులు చేయవచ్చని భావిస్తున్నారు. మంత్రి, ఐఏఎస్ తో పాటు అదే శాఖకు చెందిన కొంత మంది ఇంజనీర్లు కూడా ప్రస్తుతం ఫుల్ టెన్షన్ తో గడుపుతున్నారు. ఏపీలో సాగుతున్న ఈ ఐటి దాడుల వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచిచూడాల్సిందే.

Next Story
Share it