మెట్రో ట్రబుల్స్.....క్లియర్
హైదరాబాద్ మెట్రో శనివారం నాడు ప్రయాణికులకు చుక్కలు చూపించింది. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నాం వరకూ మియూపూర్-అమీర్ పేట మార్గంలో సేవలకు అంతరాయం కలిగింది. దీంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. హైదరాబాద్ లో మెట్రో సేవలు ప్రారంభం అయిన తర్వాత ఇలాంటి అంతరాయం ఏర్పడటం ఇదే మొదటిసారి. సడన్ గా మెట్రో సేవలకు బ్రేక్ పడటంతో వీటిని నమ్ముకుని ఉద్యోగాలకు వెళ్ళేందుకు రెడీ అయిన ప్రయాణికులకు అసౌకర్యం కలిగింది. అయితే మధ్యాహ్నాం నుంచి సేవలు యధావిధిగా కొనసాగాయి.
మెట్రో పవర్ ప్లాంట్‌లో సమస్య తలెత్తడంతోనే రైలు నిలిచిపోయిందని సిబ్బంది తెలిపారు. ప్రయాణీకులు మాత్రం విద్యుత్ అంతరాయం వల్లనే రైలు మార్గ మధ్యలో ఆగిపోయిందని ఆరోపించారు. రైలు ఆగిపోవడంతో ఆందోళన చేపట్టిన ప్రయాణీకులకు అధికారులు వారి టికెట్ ధర చెల్లించి పంపించేశారు. మెట్రో సేవలకు కలిగిన అంతారాయం పై ఎల్ అండ్ టి విచారం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని తెలిపింది. మధ్యాహ్నాం 1.30 గంటల నుంచి మెట్రో సర్వీసులు ప్రారంభం అయ్యాయని
తెలిపింది.