Telugu Gateway
Movie reviews

’హలో గురూ ప్రేమ కోసమే’ మూవీ రివ్యూ

’హలో గురూ ప్రేమ కోసమే’ మూవీ రివ్యూ
X

హీరో రామ్. ‘నేను శైలజ’ తర్వాత మరో హిట్ కోసం వేచిచూస్తున్నారు. రామ్ హీరోగా నటించిన ఉన్నది ఒక్కటే జిందగీ, హైపర్ సినిమాలు పెద్దగా సక్సెస్ సాధించలేకపోయాయి. ఇప్పుడు ‘హలో గురూ ప్రేమ కోసం’ అంటూ రామ్ దసరా రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. త్రినాధరావు మక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ కు జోడీగా అనుపమా పరమేశ్వరన్, ప్రణీతలు నటించారు. విజయదశమి రోజు విడులైన ఈ సినిమా రామ్ కు విజయాన్ని అందించిందా? అంటే మరో సారి నిరాశనే మిగిల్చిందని చెప్పొచ్చు. ఇప్పటికే అనేక సినిమాల్లో ప్రయోగించిన పాత కథనే నమ్ముకున్నారు దర్శకుడు త్రినాథరావు. కథనంలో కాస్త కొత్తదనం చూపించటం ద్వారా పర్వాలేదనిపించినా హీరో రామ్ కు హిట్ మాత్రం దక్కలేదనే చెప్పొచ్చు. సంజు (రామ్) కాకినాడలో ఉంటూ ఫ్రెండ్స్ తో కలసి అల్లరిచిల్లరగా తిరుగుతుంటాడు. మేనమామ (పోసాని కృష్ణమురళీ) హైదరాబాద్ పోయి ఉద్యోగం చేసుకోమని చెబుతాడు. అయితే పుట్టిన ప్రాంతం కాకినాడ, తల్లితండ్రులను వదిలి వెళ్ళటం ఇష్టం లేదని చెబుతాడు. అలా పోవటం తన తల్లిదండ్రులకు కూడా నచ్చదని చెబుతాడు. ఉద్యోగం చేస్తానంటే తల్లిదండ్రులు ఏమంటారో ఓ సారి మాట్లాడి చూడమని చెపుతాడు పోసాని. వెంటనే ఉద్యోగానికి వెళ్ళాలని..హైదరాబాద్ లో తన ఫ్రెండ్ ప్రకాష్ రాజ్ ఇంట్లో ఉండమని చెబుతుంది రామ్ తల్లి.

రామ్ హైదరాబాద్ వెళ్ళే ట్రైన్ లోనే కాకినాడ నుంచి హైదరాబాద్ వెళుతుంది అను (అనుపమ పరమేశ్వరన్). అంతకు ముందే అను ఫ్రెండ్ రైలులో పోకిరీలు ఉన్నారని..జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తుంది. అంతే రామ్ ను చూసి భయపడిన అను నిద్రపోకుండానే హైదరాబాద్ చేరుకుంటుంది. అను ఓ క్యాబ్ లో, రామ్ ఓ క్యాబ్ లో ఒకే ఇంటికి చేరుకుంటారు. రైలులో వేధించిన కుర్రాడు ఏకంగా ఇంటికి వచ్చేసరికి అను హడావుడిగా ఇంట్లోకి వెళుతుంది. అక్కడ నుంచే అసలు కథ మొదలవుతుంది. హైదరాబాద్ లో తొలుత ఓ ఐటి కంపెనీలో చేరిన రామ్..ప్రణీత లవ్ ట్రాక్ నడుస్తుంది తొలుత. ఇందులో ఏ మాత్రం ఫీల్ లేకుండానే రొటీన్ గా సాగుతుంది అది. ఫ్రణీత రోల్ కూడా చాలా పరిమితమే. ఓ రోజు ప్రణీత రామ్ కు తాను లవ్ చేస్తున్నానని..అందుకు కారణాలు చెప్పటంతో అవును..నేను కూడా అనును ప్రేమిస్తున్నానని చెబుతాడు రామ్.

ఐటి ఉద్యోగిగా రామ్ ఫస్టాఫ్ లో ఎనర్జిటిక్ యాక్షన్ తో పాటు నవ్వులు పూయించాడు. సెకండాఫ్ సినిమా కాస్త సీరియస్ గా సాగుతుంది. ముఖ్యంగా అను తండ్రి ప్రకాష్ రాజ్, రామ్ మధ్య నడిచే ‘ఫ్రెండ్ షిప్’ వ్యవహారం ఆసక్తికరంగా మారుతుంది. ఓవరాల్ గా చూస్తే ‘హలో గురూ ప్రేమకోసమే’ ఓ టైమ్ పాస్ సినిమా. ఈ సినిమాలో చెప్పుకోదగ్గ పాత్రలు ఏమైనా ఉన్నాయంటే అది రామ్, ప్రకాష్ రాజ్, అనుపమా పరమేశ్వరన్ లవే. ఈ సినిమాకు కాస్తో కూస్తో జీవం పోసింది అంటే కామెడీనే.

రేటింగ్. 2.5/5

Next Story
Share it