Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో హెచ్ సీఎల్ టెక్నాల‌జీ క్యాంప‌స్ కు భూమి పూజ‌

ఏపీలో హెచ్ సీఎల్ టెక్నాల‌జీ క్యాంప‌స్ కు భూమి పూజ‌
X

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఐటి రంగంలోని ఆగ్ర‌శ్రేణి సంస్థ‌ల్లో ఒక‌టైన హెచ్ సీఎల్ త‌న క్యాంప‌స్ ఏర్పాటుకు రెడీ అయిపోయింది. ఈ సంస్థ త‌న క్యాంప‌స్ భ‌వ‌నాల నిర్మాణానికి సంబంధించి సోమ‌వారం నాడు భూమి పూజ నిర్వ‌హించింది. ఈ కార్య‌క్ర‌మంలో ఏపీ ఐటి శాఖ మంత్రి నారా లోకేష్‌, హెచ్ సీఎల్ సీఈవో రోషిణి నాడార్ పాల్గొన్నారు. హెచ్ సీఎల్ రెండు దశల్లో హెచ్‌సీఎల్ త‌న క్యాంప‌స్ ను డెవ‌ల‌ప్ చేయ‌నుంది. కంపెనీ రెండు దశల్లో మొత్తం 750 కోట్ల రూపాయ‌ల పెట్టుబడులు పెట్టనుంది. హెచ్‌సీఎల్ ద్వారా 7500 మంది ఉద్యోగాలు రానున్నాయి. మొదటి దశలో రూ.400 కోట్ల పెట్టుబడి, 4వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. మొదటి దశలో ఐటీ రంగంలో పరిశోధన, అభివృద్ధి కేంద్రం ప్రారంభించనున్నారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఏపీకి వ‌చ్చిన ప్ర‌ముఖ కంపెనీ ఇదే. ఈ సంస్థ‌కు స‌ర్కారు భారీ ఎత్తున రాయితీలు, ప్రోత్సాహ‌కాలు ఇస్తున్నా..ప్ర‌ముఖ సంస్థ కావ‌టంతో దీనిపై పెద్ద‌గా అభ్యంత‌రాలు ఉండాల్సిన అవ‌స‌రం లేద‌ని అధికార వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

Next Story
Share it