ఫస్ట్ టైమ్..పెట్రోల్ ను దాటిన డీజిల్ ధర
BY Telugu Gateway22 Oct 2018 11:08 AM IST

X
Telugu Gateway22 Oct 2018 11:08 AM IST
ఈ వింత ఒడిశాలో నమోదు అయింది. సహజంగా ఎప్పుడైనా పెట్రోల్ కంటే డీజిల్ ధర తక్కువ ఉంటుంది. కానీ ఫస్ట్ టైమ్ దేశంలో డీజిల్ ధర పెట్రోల్ ను దాటేసింది. ఈ రకంగా కొత్త రికార్డు నమోదు అయింది. ఒడిసా ఈ రికార్డు నెలకొల్పింది. దేశంలో ఒక్క ఒడిశా రాష్ట్రంలోనే ఈ పరిణామం చోటుచేసుకుంది. భువనేశ్వర్ లో పెట్రోల్ లీటర్ ధర 80.57 రూపాయలు ఉంటే...డీజిల్ రేటు మాత్రం 80.69 రూపాయలకు చేరింది.
రెండు రేట్ల మధ్య వ్యత్యాసం పైసల్లోనే ఉన్నా..ఇది ఓ కొత్త రికార్డుగా చెబుతున్నారు. వివిధ రాష్ట్రాల్లో పన్నుల మధ్య వ్యత్యాసాలు ఉన్నా కూడా ఒడిశాలో మాత్రం పెట్రోల్, డీజిల్ పై ఒకే విధంగా 26 శాతం వ్యాట్ విధిస్తున్నట్లు ఉత్కల్ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సంజయ్ లాథ్ తెలిపారు.
Next Story



