సీబీఐ వివాదంలో కొత్త ట్విస్ట్

సీబీఐ వివాదంలో ఇది మరో మలుపు. డైరక్టర్ పదవి నుంచి తనను తప్పించటంపై సర్కారుకు వ్యతిరేకంగా అలోక్ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన పిటీషన్ దాఖలు చేయటంతో..సుప్రీం దీన్ని విచారణకు స్వీకరించింది. అలోక్ వర్మ పిటిషన్‌ను శుక్రవారం విచారించనున్నట్టు సుప్రీం కోర్టు పేర్కొంది. మరోవైపు ముడుపుల ఆరోపణలను ఎదుర్కొంటున్న సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్ధానాను కాపాడేందుకే అలోక్ వర్మను తొలగించారని కాంగ్రెస్ ఆరోపించింది. సీబీఐ ఉన్నతాధికారుల నడుమ తీవ్ర విభేదాలు నెలకొనటంతో అలోక్ వర్మ, రాకేష్ ఆస్ధానాలను ప్రభుత్వం సెలవుపై పంపి, నూతన సీబీఐ తాత్కాలిక చీఫ్‌గా నాగేశ్వరరావును నియమించిన సంగతి తెలిసిందే.
అలోక్ వర్మ సుప్రీం కోర్టును ఆశ్రయించటంతో ఈ వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో అన్న ఆసక్తి నెలకొంది. అసలు అదనపు డైరక్టర్ గా రాకేష్ ఆస్థానాను నియమించటమే సరికాదని..ఇప్పుడు డైరక్టర్ తొలగింపు కూడా పద్దతి ప్రకారం జరగలేదని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న నిపుణులు చెబుతున్నారు. సీబీఐ ప్రత్యేక డైరక్టర్ గా పనిచేసిన రాకేష్ ఆస్థానాను కేసు విచారిస్తునున అధికారులను కూడా తప్పించారు.