Telugu Gateway
Andhra Pradesh

రంగంలోకి దిగిన ఈడీ

రంగంలోకి దిగిన ఈడీ
X

ముఖ్య నేతకు ..కేంద్ర మాజీ మంత్రికి టెన్షన్ టెన్షన్!

ఏపీకి సంబంధించిన ‘‘ముఖ్యుల’’ లెక్కలు తేల్చేందుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) కూడా రంగంలోకి దిగిందా?. అంటే అవుననే చెబుతున్నాయి విశ్వసనీయ వర్గాలు. సీబీఐ మాజీ డైరక్టర్ విజయరామారావు తనయుడు శ్రీనివాస కళ్యాణరావు నివాసంతో పాటు..మరికొన్ని కంపెనీల్లోనూ ఈడీ సోమవారం నాడు తనిఖీలు చేపట్టింది. అదే సమయంలో పలు ఇతర సంస్థల్లో కూడా ఈడీ తనిఖీలు సాగాయి. ఇప్పటికే విజయరామారావు తనయుడు శ్రీనివాస కళ్యాణరావుపై సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మొత్తం వ్యవహారంలో ఏపీకి చెందిన ముఖ్యనేత కంపెనీతోపాటు...కేంద్ర మాజీ మంత్రి కంపెనీలకు మధ్య ‘లింక్’ ఉన్నట్లు ఈడీ వర్గాలు అనుమానిస్తున్నాయి. బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఎండీ గా ఉన్న సమయంలో కళ్యాణరావు బ్యాంకుల కన్సార్టియం నుంచి మొత్తం 304 కోట్ల రూపాయల రుణం తీసుకుని తర్వాత డిఫాల్ట్ అయిన సంగతి తెలిసిందే.

బ్యాంకుల నుంచి రుణం తీసుకున్న తర్వాత ఈ సంస్థ వాటిని చెల్లించటంలో విఫలం అయింది. ఏపీలో ఈ మధ్యే ఐటి శాఖ అధికారులు భారీ ఎత్తున దాడులు నిర్వహించి...పెద్ద ఎత్తున రికార్డులు తనిఖీ చేసిన సంగతి తెలిసిందే. దానికి కొనసాగింపుగానే హైదరాబాద్ లో కూడా తనిఖీలు ప్రారంభించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ముఖ్య నేత కంపెనీకి..కేంద్ర మాజీ మంత్రి కంపెనీకి..ఈ రుణాల ఎగవేతకు మధ్య లింక్ ను చేధించే పనిలో ఈడీ అధికారులు ఉన్నారని సమాచారం. దీంతో పాటు అవినీతి సొమ్మును వివిధ కంపెనీలకు మళ్ళించారని..ఇవన్నీ పెద్దల బినామీలే అని పక్కా ఆధారాలతో అటు ఐటి శాఖ, ఇటు ఈడీలు దర్యాప్తు సాగిస్తున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో ప్రభుత్వ పెద్దల అవినీతికి సంబంధించి పక్కా ఆధారాలు సేకరించే పనిలో దర్యాప్తు సంస్థలు ఉన్నాయి. దీంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయి.

Next Story
Share it