Telugu Gateway
Telangana

కెసీఆర్..దమ్ముంటే నా బండారం ఏందో బయటపెట్టు

కెసీఆర్..దమ్ముంటే నా బండారం ఏందో బయటపెట్టు
X

తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే మాటల తూటాలు పేలుతున్నాయి. హాట్ హాట్ విమర్శలతో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. సాక్ష్యాత్తూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసీఆరే తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ప్రతిపక్షాలు కూడా అదే స్థాయిలో వాటిని తిప్పికొడుతున్నాయి. వనపర్తి సభలో కెసీఆర్ తనపై చేసిన విమర్శలకు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డీ కె అరుణ తీవ్ర స్థాయిలో స్పందించారు. ‘వనపర్తి లో కేసీఆర్ మాట్లాడిన తీరు చూస్తే ..ఓటమి భయం పట్టుకున్నట్లు కనబడుతుంది. ఆయన మాటల్లో ప్రస్టేషన్ కనబడుతోంది. కాంగ్రెస్ నాయకులను ఇష్టమోచ్చినట్లు తిట్టోచ్చు ఇంకా ఇవి ఉధ్యమ రోజులు అనుకుంటున్నావా? మహాబుబ్ నగర్ లో ఈయన వెలగబెట్టింది ఏంటి? .పూర్తయిన ప్రాజెక్టు కు కనీసం కాలువలు కూడా తవ్వలేదు..సిగ్గుందా మీకు...జూటా మాటల మాట్లాడడం బంద్ జెయ్...ప్రాజెక్టు లల్ల పడుకోలే మీ నాయకులు...గెస్ట్ హౌస్ ల పడుకొని ఏంజాయ్ చేసిర్రు...సోయి తప్పిన మాటలు బంద్ జెయ్...సంస్కారం నేర్చుకో..5 సంవత్సరాలు పాలమూరు ఏంపీ గా ఉండి నువ్ ఏం చేసినవ్.

జారాలా ,ఆర్డీఎస్ ,నెట్టెంపాడు కు ఓరగబెట్టింది ఏముందు..జోగులాంబ తల్లి నిన్ను శిక్షిస్తది..జూటాకోర్ కేసీఆర్ నా బండారం బయట పెడతవా. ఇన్ని రోజుల నుంచి ఎందుకు బయట పెట్టలే...నన్ను వ్యక్తి గతంగా విమర్శలు చేస్తవా..నీ ఇంట్లే ఆడోళ్ళు లేరా.. ఒక శక్తి తో పెట్టుకున్నావ్...ఇగ కాస్కో ...నా జాతకం బయట పెడతవా..దా నీ జాతకం నా జాతకం బయట పెడతాం..అరేయ్ దమ్ముంటే రఘువీరా రెడ్డి కి నేను మంగలహారతి పట్టిన వీడియో చూయించు...కేంద్ర మంత్రి గా ఉన్నప్పుడు ఏం పీకినవ్ కేసీఆర్... ఏన్నికలంటే నీకు తమషా అయిపోయింది...అరుణమ్మ గురించి మాట్లాడే స్థాయా నీదా...నీ లాగా మందిని అమ్మిన కుటుంబం కాదురా మాదీ...త్యాగాలు చేసిన కుటుంబం నుంచి వచ్చిన. గద్వాల ప్రజలకు అరుణమ్మ ఏందో తెలుసు , నువ్వు చెప్పేది ఏందీ...నీ మాటలకు బయపడుతావనుకుంటుంన్నావేమో ..ఇంకో పది అడుగులు ముందు కు వేస్తాం... నువ్ మాట్లాడితే శ్లోకాలు.. మేం మాట్లాడితె బూతులా...ఇది తెలంగాణ సాంప్రదాయమా..ఉద్యమం గురించి నిరాహారదీక్ష నువ్ చేసినవా..నిమ్స్ ఆస్పిటల్ పోదాం రా నీ రిపోర్ట్ లు బయటపెడతాం... ఈ టిఆర్ఏస్ నా కొడుకులు మోసం చేసి ..తెలంగాణ పిల్లలను చంపుతున్నరు...అని తెలంగాణ ఇచ్చినం.. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారికి ఎంతమంది కి సహాయం చేసినవో చెప్పు... బటానీలు అమ్ముకుంటొంళ్ళంత మంది కూడా మా మీటింగ్ కు రాలేదంటవా.

మరీ ఎందుకు నీ కంత ఉలికి పాటు..నీలాగ వందల బస్సులు, పైసలు పెట్టి సభలకు జనాన్ని తోలుకొస్తలేము...నిన్న నీ మీటింగ్ కు నలబై‌ ,యాబై వేల మంది రాలే...జోగులాంబ అమ్మవారి ఆశీస్సులతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది..ఒక మహిళను అవమాన పరిచినట్లుగా మాట్లాడావ్..నువ్ మాడి మసైపోతావ్...తెలంగాణ రాష్ట్రం లో ఇదే చివరి కుర్చి నీది కేసీఆర్...తెలంగాణ మహిళల శాపం నీకు పెడుతున్న...తెలంగాణ రాబందుల పార్టీ టీఆర్ఎస్...చాతకాని దద్దమ్మల కు మళ్ళీ ఓట్లు వేయాలా...కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తప్ప తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లభించదు...మళ్ళీ అవే అబద్దాలు...అవే అబద్దపు హామీలు...హారతులు పట్టిన వీడియో చూయించకుంటె కేసీఆర్ రాజకీయ సన్యాసం తీసుకుంటడా...ఆ ప్రాజెక్టు ప్రారంబించేటప్పుడు టిఆర్ఏస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది..నేను ఇండిపెండెంట్ గా గెలిచి కాంగ్రెస్ కు మద్దతిచ్చా...ఏడు మండలాలను ఏపీ లో కలిపేటప్పుడు ఏంధుకు కాళ్ళు పట్టుకుని ఆపలేదు... నీ ఏన్నికల కోసం మోడీ కాళ్ళు పట్టుకున్నవ్.’ అని అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Next Story
Share it