Telugu Gateway
Andhra Pradesh

చంద్ర‌బాబు వేలికి ఉంగరం..ఆప‌రేష‌న్ గ‌రుడ‌కు విరుగుడా!

చంద్ర‌బాబు వేలికి ఉంగరం..ఆప‌రేష‌న్ గ‌రుడ‌కు విరుగుడా!
X

నా చేతికి వాచీ ఉండ‌దు. వేలికి ఉంగ‌రం ఉండ‌దు. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ఎన్నోసార్లు చెప్పిన మాట ఇది. నిత్యం ప్ర‌త్యేక విమానాల్లో తిరుగుతూ ఎక్క‌డా 7 స్టార్ సౌక‌ర్యాల‌కు తీసిపోని విలాస‌వంతమైన వ‌స‌తుల‌ను అనుభ‌వించే చంద్ర‌బాబు ..తాను ఎంతో సామాన్యుడిని అని చెప్పుకునే ప్ర‌య‌త్నం చేసేవారు. ఎప్పుడు అవినీతి ఆరోప‌ణ‌లు వ‌చ్చినా ఇదే విష‌యాన్ని ప‌దే ప‌దే వ‌ల్లెవేసేవారు. అంటే అదేదో చేతికి వాచీలు..ఉంగరాలు ఉన్న వాళ్ళంతా అవినీతిప‌రులు..దోపిడీదారులు

అన్న‌ట్లు చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు ఉండేవి. చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌పై అధికారులు కూడా అవాక్కు అయ్యేవారు. కానీ అవేమీ ప‌ట్టించుకోని చంద్ర‌బాబు తాను చెప్ప‌ద‌ల‌చుకున్న‌ది అలా చెప్పుకుంటూ పోతారు.

ఆయ‌న‌కు అదే అల‌వాటు. ఇదంతా ఇప్పుడెందుకు అంటారా?. చంద్ర‌బాబు శుక్ర‌వారం నాడు జ‌రిగిన రెండ‌వ రోజు క‌లెక్ట‌ర్ల స‌మావేశానికి వేలికి ఉంగ‌రం పెట్టుకుని వ‌చ్చారు. టీవీల్లో చూస్తే అది రాగి ఉంగ‌రంలా క‌న్పిస్తోంది. అయితే అది రాగి ఉంగ‌ర‌మా? లేక బంగారు ఉంగ‌ర‌మా? అన్న‌ది మాత్రం తెలియ‌లేదు. అంత సింపుల్ గా ఉంటాన‌ని చెప్పే చంద్ర‌బాబు స‌డ‌న్ గా వేలికి ఉంగ‌రం ఎందుకు తొడిగిన‌ట్లు?. ఎవ‌రైనా జ్యోతిష్యుల చెప్పిన దాని ప్ర‌కారం పెట్టుకున్నారా? లేక ఆప‌రేష‌న్ గ‌రుడ‌కు విరుగుడా?. మొత్తానికి చంద్ర‌బాబు కూడా మార్గ‌దర్శిలో చేరారు..ఓ ఉంగ‌రం కొనుక్కున్నారు.

చంద్ర‌బాబు చేతికి ఉంగ‌రం పెట్టుకున్న చిత్రాల‌ను ఈ వీడియోలో చూడ‌వ‌చ్చు

https://www.youtube.com/watch?v=xbi3HX2Pqpc

Next Story
Share it