Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు ‘అంతర్జాతీయ మోసం’!

చంద్రబాబు ‘అంతర్జాతీయ మోసం’!
X

ఎల్ అండ్ టి..ఎన్ సీసీ సింగపూర్ కంపెనీలా బాబూ!

ఇది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ‘అంతర్జాతీయ మోసం’. రాజధాని అమరావతి అంశం తెరపైకి వచ్చినప్పటి నుంచి ‘అంతర్జాతీయ ప్రమాణాల’తో రాజధాని అంటూ ఊదరగొట్టారు. ఏ దేశం వెళితే ఆ దేశం పేరు చెప్పి రాజధానికి లింక్ పెట్టారు. అమరావతి ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు పొందుతుందని..దాని కోసం రాజధాని నిర్మాణానికి సింగపూర్ కంపెనీలకు అప్పగిస్తున్నట్లు మోసగించారు. ఇవిగో సింగపూర్ కంపెనీలు కట్టే రాజధాని భవనాలు..బ్రిడ్జిలు అంటూ ‘రంగుల ప్రపంచం’ చూపించారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు అమరావతిలో అత్యంత కీలకమైన సచివాలయం ఐదు బ్లాక్ ల కాంట్రాక్ట్ లను దేశీయ కంపెనీలైన ఎల్ అండ్ టి, ఎన్ సీసీ, షాపూర్జి పల్లోంజీ వంటి వాటికి అప్పగించారు. దేశీయ కంపెనీలు కేవలం స్లమ్స్ మాత్రమే కడతాయని..రాజధానికి కొత్త లుక్ తీసుకురావటానికి తాను సింగపూర్ కంపెనీలను తెచ్చే ప్రయత్నం చేస్తుంటే విమర్శలు చేస్తారా? అంటూ ఎదురుప్రశ్నించారు.

అంతే కాదు..తన ఇమేజ్. క్రెడిబులిటీ చూసి సింగపూర్ కంపెనీలు రాజధాని నిర్మానానికి ముందుకు వచ్చాయని పదే పదే ప్రజలను మోసం చేశారు. నిన్న మొన్నటి వరకూ రాజధాని రాజధాని నిర్మాణం సింగపూర్ కంపెనీలే చేస్తున్నాయని ప్రకటించారు. ఇప్పుడు మాత్రం పూర్తిగా దేశీయ కంపెనీలకు అప్పగించి..పనులు ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. మరి సింగపూర్ కంపెనీలు ఏమయ్యాయి?. చంద్రబాబు ఇమేజ్. క్రెడిబులిటీ చూసి వచ్చిన సంస్థలు వెనక్కి పోయాయా?. పోతే ఎందుకు వెళ్ళాయి. ఏపీ ప్రజలను నమ్మించిన చంద్రబాబు ఈ విషయంలో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా?. సింగపూర్ కంపెనీలు అని మూడున్నర సంవత్సరాలు పాటు ప్రజలను నమ్మించి..ఇఫ్పుడు స్థానిక కంపెనీలకు కాంట్రాక్ట్ లు ఇచ్చి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘అంతర్జాతీయ మోసానికి’ పాల్పడ్డారని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.

వాస్తవానికి సింగపూర్ కంపెనీలు చేసేది పూర్తిగా ‘ప్రైవేట్ దందా’. ఈ దందా చేసుకోవటానికే చంద్రబాబు అమరావతి పేరుతో సింగపూర్ జపం చేశారు. విదేశీ కంపెనీల ముందు ఏపీ సర్కారు సాగిలపడినా కూడా ..అవి వచ్చే ఎన్నికల్లో మళ్ళీ చంద్రబాబు వస్తారో రారో అనుమానం ఉండటంతో పనులు ప్రారంభించకుండా జాప్యం చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ చంద్రబాబు గెలిస్తేనే ఆ సింగపూర్ సంస్థలు పనులు ప్రారంభించే అవకాశం ఉందని చెబుతున్నారు. స్విస్ ఛాలెంజ్ అక్రమాలతోపాటు..సింగపూర్ కంపెనీల ఫ్రాడ్ ను ‘తెలుగు గేట్ వే. కామ్’ పలు సందర్భాల్లో వెలుగులోకి తెచ్చింది.

Next Story
Share it