బతుకమ్మ చీరల పంపిణీకి బ్రేక్
BY Telugu Gateway3 Oct 2018 9:14 PM IST

X
Telugu Gateway3 Oct 2018 9:14 PM IST
ఎన్నికల కోడ్ తెలంగాణ సర్కారుకు పెద్ద చిక్కే తెచ్చిపెట్టింది. పాత పథకమే అయినా బతుకమ్మ చీరల పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) బ్రేక్ వేసింది. ఇది వ్యక్తిగత లబ్ది కిందకు వస్తుంది కాబట్టి..చీరల పంపిణీని ఆపేయాలని ఆదేశించారు. దసరా ముందు జరిగే బతుకమ్మ పండగ కోసం తెలంగాణ అంతటా పంచేందుకు సర్కారు దాదాపు కోటి చీరలను సిద్ధం చేసింది.
కానీ ఇప్పుడు వాటి పంపిణీకి బ్రేక్ పడింది. షెడ్యూల్ ప్రకారం ఈ ఈ నెల 12 నుంచి చీరల పంపిణీ ప్రారంభం కావాల్సి ఉంది. 280 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ చీరల పంపిణీ తలపెట్టారు. సీఈసీ తాజా ఆదేశాలతో రైతు బంధు చెక్కుల పంపిణీపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Next Story