Telugu Gateway
Cinema

24 కిస్సెస్ ట్రైలర్ వచ్చేసింది

24 కిస్సెస్ ట్రైలర్ వచ్చేసింది
X

హెబ్బా పటేల్. చాలా గ్యాప్ తర్వాత 24 కిస్సెస్ అంటూ ప్రేక్షకుల ముందుకొస్తోంది. టాలీవుడ్ లో కుమారి 24 ఎఫ్ అనే తొలి సినిమాతోనే కుర్రకారు మనసు దోచుకున్న ఈ హీరోయిన్ తర్వాత కాలంలో వరస సినిమాలు దక్కించుకోవటంలో విఫలమైంది. అడపాదడపా సినిమాలు చేసినా అవి కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఫలితం దక్కించుకోలేక పోయాయి. దీంతో ఈ భామ ఇంచుమించు తెరమరుగైంది. ఇప్పుడు సుదీర్ఘ విరామం తర్వాత ఓ కొత్త హీరోతో కలసి 24 కిస్సెస్ అంటూ ముందుకొస్తోంది.

ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. రావు రమేష్ తో కలసి హీరో అదిత్ అరుణ్ ప్రేమదేశంలోని పాటతో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. యువతను టార్గెట్ చేసుకుని సినిమా తెరకెక్కించినట్లు ట్రైలర్ చెప్పకనే చెబుతోంది. 24 కిస్సెస్ సినిమాకు ఉప శీర్షికగా నీకో సగం..నాకో సగం అని పెట్టారు. వచ్చే నెల 15న సినిమాను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

https://www.youtube.com/watch?v=l3jy-kXoNbo

Next Story
Share it