విజయ్ ‘నోటా’ విడుదల 5న
BY Telugu Gateway23 Sept 2018 12:22 PM IST

X
Telugu Gateway23 Sept 2018 12:22 PM IST
గీత గోవిందం సినిమాతో మరో హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ కొత్త సినిమాతో రెడీ అయ్యారు. విజయ్ హీరోగా నటించిన ‘నోటా’ సినిమా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విడుదల తేదీపై గందరగోళం నెలకొనటంతో ఆయన అభిమానుల నుంచి ఓటింగ్ కోరారు. ఎక్కువ మంది అక్టోబర్ 5నే విడుదల చేయాలని సూచించటంతో ఆ తేదీనే ఖరారు చేశారు. ఈ సినిమాలో విజయ్ రాజకీయ నాయకుడిగా కన్పిస్తున్నారు.
విజయ్ దేవరకొండకు జోడీగా తొలిసారి మెహరీన్ నటించారు. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించారు. ఇందులో డైలాగులు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేళ ఈ సినిమా రాజకీయంగా ఎంత సంచలనం సృష్టిస్తుందో వేచిచూడాల్సిందే.
Next Story



