Telugu Gateway
Cinema

అక్టోబర్ 5న ‘వీరభోగ వసంత రాయలు’

అక్టోబర్ 5న ‘వీరభోగ వసంత రాయలు’
X

నారా రోహిత్ విభిన్న కథాంశాలతో సినిమాలు చేస్తున్న హీరో. ఆయన హీరోగా చేస్తున్న మరో కొత్త సినిమా విడుదలకు సిద్ధమైంది. ఫలితంతో సంబంధం లేకుండా ఆయన సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. అయితే త్వరలో విడుదల అయ్యే కొత్త సినిమా వీరభోగ వసంతరాయులు లో నారా రోహిత్ తో పాటు సుదీర్ బాబు కూడా నటిస్తున్నారు. శ్రియ, శ్రీవిష్ణు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కనుంది. కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కే ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని చిత్ర యూనిట్ ఆశాభావంతో ఉంది. ఈ సినిమాకు ‘కొత్త మతం పుట్టుకొస్తోంది’ అనే ట్యాగ్ లైన్ పెట్టడంపై సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

Next Story
Share it