కాంగ్రెస్ ‘స్టార్ క్యాంపెయినర్’ గా విజయశాంతి
BY Telugu Gateway19 Sept 2018 9:21 PM IST

X
Telugu Gateway19 Sept 2018 9:21 PM IST
కాంగ్రెస్ అధిష్టానం సీనియర్లకు ఝలక్ ఇచ్చింది. టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డికి ‘ప్రచార కమిటీ’ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరిగినా..సీనియర్ల ఒత్తిడికి అధిష్టానం తలొగ్గింది. ఈ బాధ్యతను సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్కకు అప్పగించినా..మరో నియామకం ద్వారా ఆయనకు కూడా షాక్ ఇఛ్చినట్లు అయింది.
గత కొంత కాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న విజయశాంతిని ఏకంగా తెలంగాణ ఎన్నికల ప్రచార స్టార్ క్యాంపెయినర్ గా నియమించటం విశేషం. స్టార్ క్యాంపెయినరే కాకుండా ఆమెకు తెలంగాణ ప్రదేశ్ ఎన్నికల ప్రచార కమిటీ సలహాదారు బాధ్యత కూడా అప్పగించారు. చివరకు రేవంత్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలతో సర్దుకోవాల్సి వచ్చింది.
Next Story