Telugu Gateway
Andhra Pradesh

ఐక్యరాజ్య సమితిలో మాట్లాడితే ఫోటో ఇలా ఉంటుంది సార్..!

ఐక్యరాజ్య సమితిలో మాట్లాడితే ఫోటో ఇలా ఉంటుంది సార్..!
X

ఈ ఐటెంలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఫోటో ఉంది చూశారా?. ఆమె తాజాగా ఐక్యరాజ్య సమితిలో మాట్లాడారు. ఆ ఫోటోలో చూస్తే ఐక్యరాజ్యసమితి లోగోతో పాటు..ఆ విషయం స్పష్టంగా అర్థం అయిపోతుంది. ఈ మధ్య ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఐక్యరాజ్యసమితి భవనంలో జరిగిన ఓ సమావేశంలో పాల్గొని ఐక్యరాజ్యసమితి సమావేశం అని ప్రచారం చేసుకున్నారు. జీవోలు ఇచ్చుకుని..సొంత డబ్బులు పెట్టుకుని మరీ పర్యటన వెళ్ళి ప్రకృతి సేద్యంపై ప్రసంగానికి తనకు ఆహ్వానం వచ్చిందని ప్రచారం చేసుకున్నారు. ఈ వ్యవహారం పెద్ద చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. పోనీ చంద్రబాబు మాట్లాడే మైక్ పై లేకపోతే లేదు..వేదిక వెనకాల అయినా ఈ లోగో ఉండాలి కదా? లేదు. అంటే దానర్ధం?.

ఏపీ సీఎం చంద్రబాబుతో పోలిస్తే కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ కూడా ఇంత ప్రచారం చేసుకుని ఉండరు. తాజాగా సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ఏకంగా ప్రధాని నరేంద్రమోడీ విదేశీ పర్యటనలపై తీవ్ర విమర్శలు చేశారు. అన్ని దేశాలు తిరిగి మోడీ ఏమి సాధించారని తీవ్ర విమర్శలు చేశారు. మరి చంద్రబాబు విదేశీ పర్యటనల ఫలితం?. ఓ పెద్ద ప్రశ్నగానే ఉంది. చంద్రబాబు ఐక్యరాజ్యసమితి పర్యటనకు వెళ్లినప్పుడే కావాలనే....కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కూడా ఐక్యరాజ్యసమితి పర్యటనకు వెళ్ళాలా?. ఇది కూడా ప్రధాని మోడీ కుట్రలో భాగమే అని చంద్రబాబు అన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

Next Story
Share it