Telugu Gateway
Politics

రాఫెల్ స్కాంలో కొత్త పాత్ర?!..తెలుగు గేట్ వే.కామ్ ఎక్స్ క్లూజివ్ స్టోరీ

రాఫెల్ స్కాంలో కొత్త పాత్ర?!..తెలుగు గేట్ వే.కామ్ ఎక్స్ క్లూజివ్ స్టోరీ
X

ఢిల్లీ అధికార వర్గాల్లో చర్చ

తెలుగు గేట్ వే.కామ్ ఎక్స్ క్లూజివ్ స్టోరీ

రాఫెల్ స్కామ్. మోడీ సర్కారును కుదిపేస్తున్న అంశం. బిజెపి పైకి గంభీరంగా కాంగ్రెస్ పై ఎన్ని విమర్శలు చేస్తున్నా...ఈ అంశంతో మోడీ సర్కారు ప్రతిష్ట మాత్రం మసకబారిందనేది వాస్తవం అని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ స్కామ్ కు సంబంధించి తాజాగా ఓ కొత్త అంశంపై ఢిల్లీ అధికార వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగోతంది. ఈ స్కాంలో ఆమె ప్రభుత్వానికి సహకరించినందుకే అత్యంత కీలకమైన పదవి ఇచ్చారా?. పదవి విమరణకు ముందే ఆరేళ్ల పదవీ కాలం ఉండే పోస్టు ఇవ్వటం వెనక రాఫెల్ స్కామ్ లో ఆమె చేసిన సాయమే కారణమా? అన్న కోణాన్ని కూడా అధికారవర్గాలు పరిశీలిస్తున్నాయి. ఇంతకూ ఆమె ఎవరు?. ఆ కథేంటో మీరూ చూడండి. ఆమె సీనియర్ ఐఏఎస్ అధికారి. పేరు స్మితా నాగరాజ్. తమిళనాడుకు చెందిన 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. మోడీ సర్కారు ఆమెను అత్యంత కీలకమైన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్ సీ) సభ్యురాలిగా నియమించింది. ఇది గత ఏడాదే జరిగంది. ఈ నియామకానికి ముందు ఆమె అత్యంత కీలకమైన రక్షణ శాఖలో డైరక్టర్ జనరల్ (ఎక్విజిషన్) గా పనిచేశారు. అంటే దేశ రక్షణ విభాగానికి అవసరమైన కొనుగోళ్ల వ్యవహారంలో ఆమె పాత్ర కీలకం కానుంది. రాఫెల్ డీల్ విషయంలో ఆమె సహకరించినందునే..ఐఏఎస్ గా పదవి విరమణ చేయటానికి ఏడాదికి పైగా సమయం ఉన్న తరుణంలో ఆమెను ఆరేళ్ల పాటు ఉండే యూపీఎస్ సీ సభ్యురాలి పదవి కట్టబెట్టారని ఢిల్లీ అధికార వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది.

ఆమె యూపీఎస్ సి సభ్యురాలిగా 2023 సెప్టెంబర్ 21 వరకూ కొనసాగనున్నారు. రాఫెల్ స్కామ్ విషయంలో ఆమె ప్రభుత్వానికి తన వంతుగా సహకరించినందునే మోడీ ప్రభుత్వం ఆమెకు ఈ కీలక పోస్టును కట్టబెట్టారని చెబుతున్నారు. రాఫెల్ స్కామ్ గుట్టురట్టు కావాలంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపీసీ) వేయాలని కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతోంది. అయితే దీనికి బిజెపి సర్కారు ససేమిరా అంటోంది. జెపీసీ అంటూ వేస్తూ ఈ ఫైళ్లకు సంబంధించిన అంశాలు సభ్యుల చేతికి వస్తాయి. దీంతో సర్కారు ఇరకాటంలో పడటం ఖాయం. అందుకే మోడీ ప్రభుత్వం జెపీసీకి అంగీకరించటం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. రాఫెల్ డీల్ వెనక స్మితా నాగరాజ్ పాత్ర ఏదైనా ఉందా? లేదా అన్నది ఫైళ్ళను పరిశీలిస్తే తప్ప తేలదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఆమె చేసిన చివరి పోస్టు..జరిగిన నియామకం చూస్తే మొత్తానికి ఏదో ‘లింక్’ ఉన్నట్లే కన్పిస్తోందని ఐఏఎస్ లు అనుమానిస్తున్నారు.

Next Story
Share it