Telugu Gateway
Cinema

ఆర్ ఎక్స్ 100 హీరోకు సూపర్ ఛాన్స్

ఆర్ ఎక్స్ 100 హీరోకు సూపర్ ఛాన్స్
X

కార్తికేయ ఎగిరి గంతేస్తున్నాడు. ఎందుకు? అంటారా? దానికి బలమైన కారణమే ఉంది. ఆర్ ఎక్స్ 100 అనే ఒక్క సినిమా...ఆయన జీవితాన్ని మార్చేసింది. తొలి సినిమానే సూపర్ హిట్ ఇచ్చింది. ఆర్ ఎక్స్ 100తో సంచలనం సృష్టించిన కార్తికేయకు ఇప్పుడు ఓఓ సూపర్ ఛాన్స్ దక్కింది. ఆయన ఇప్పుడు ఏకంగా కోలీవుడ్ స్టార్‌ ప్రొడ్యూసర్ క‌లైపులి య‌స్‌.థానుతో సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం థాను కార్తికేయ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టీఎన్ కృష్ణ ద‌ర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘హిప్పీ’ అనే టైటిల్ ఖరారు చేశారు. శుక్రవారం కార్తికేయ పుట్టిన‌రోజు జరుపుకోనుండటంతో ఒక రోజు ముందుగానే ‘హిప్పీ’ టైటిల్‌ను ప్రక‌టించారు. ఈ సందర్భంగా ద‌ర్శ కుడు టీఎన్‌ కృష్ణ మాట్లాడుతూ ‘రొమాంటిక్ కామెడీ చిత్రమిది. కార్తికేయ త‌న తొలి చిత్రానికి భిన్నంగా క‌నిపిస్తారు. ఇంకా హీరోయిన్లను ఫైనల్ చేయాల్సి ఉంది.

సినిమా ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. ప్రస్తుత ప‌రిస్థితుల‌కు అద్దం ప‌ట్టే సినిమా. మ‌న జీవితంలో నిత్యం జ‌రిగే ఎన్నో అంశాలు ఇందులో ఉంటాయి. అక్టోబ‌ర్ నుంచి హైద‌రాబాద్‌లో షూటింగ్ ఉంటుంద’ని తెలిపారు. తెలుగులో నేరుగా సినిమా తీయాల‌ని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. అది ఇప్పటికి కుదిరిందని థాను తెలిపారు. కార్తికేయ ‘ఆర్‌ఎక్స్ 100’ చూశాను. ప్రెజెంట్ ట్రెండ్‌కి త‌గ్గ హీరో అనిపించింది. ఆయ‌న‌తో ‘హిప్పీ’ అనే సినిమాను తెర‌కెక్కిస్తున్నాం. ఎక్కడా బ‌డ్జెట్‌కు వెన‌కాడ‌కుండా భారీగా రూపొందిస్తాం’ అన్నారు.

Next Story
Share it