Telugu Gateway
Cinema

ఎన్టీఆర్ సినిమా డేట్ చెప్పిన పూజా హెగ్డె

ఎన్టీఆర్ సినిమా డేట్ చెప్పిన పూజా హెగ్డె
X

ఎన్టీఆర్ కొత్త సినిమా విడుదల తేదీని హీరోయిన్ పూజా హెగ్డె ప్రకటించేసింది. అరవింద సమేత వీరరాఘవ సినిమాలో చేస్తున్న ఆమె అక్టోబర్ 11న థియేటర్స్ లో కలుద్దామని ప్రకటించటంతో విడుదల తేదీపై స్పష్టత వచ్చేసింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా పూజా హెగ్డె నటించిన సంగతి తెలిసిందే. తాజా ఈ సినిమాకు సంబంధించిన పాటను స్విట్జర్లాండ్ లో పూర్తి చేశారు. దీంతో సినిమాలో ఆమె పాత్ర పూర్తయింది.

ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమాలో నా షూటింగ్‌ పార్ట్‌ పూర్తయింది. అక్టోబర్‌ 11న థియేటర్స్‌ లో కలుద్దాం’’ అని పూజా పేర్కొన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఎస్ రాధాకృష్ణ నిర్మాతగా ఉన్నారు.

Next Story
Share it